సామీ సామీ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఎయిర్ హోస్టెస్.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా పుష్ప.ఈ సినిమా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కింది.

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ గా పుష్పరాజ్ పాత్రలో నటించడం అనే కంటే జీవించాడు అనే చెప్పాలి.

ఇక రష్మిక పుష్పరాజ్ ప్రియురాలిగా శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది.డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప సినిమా ఇప్పటికి తన మ్యానియా చూపిస్తుంది.

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా చేయడంతో ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసింది.ఈ సినిమా విజయానికి కారణం సాంగ్ లు కూడా అని చెప్పాలి.

Advertisement

అన్ని సాంగ్స్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసాయి.

ప్రతి సాంగ్ ఇంత సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుల చేత స్టెప్పులు కూడా వేయిస్తున్నాయి.ఈ సినిమాలోని సామీ సామీ సాంగ్ గురించి అయితే స్పెషల్ గా చెప్పుకోవాలి.ఈ పాటకు రష్మిక వేసిన స్టెప్పులను తమ స్టైల్ లో వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియోస్ అన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ముంబై కి చెందిన ఆయాత్ అనే ఎయిర్ హోస్టెస్ తనలోని ట్యాలెంట్ తో నెటిజెన్లను ఆకట్టుకుంది.ఈమె ఈ పాటకు వేసిన స్టెప్పులు మాత్రమే కాదు ఈమె ఆకట్టుకునే రూపం.అద్భుతమైన హావభావాలు చేస్తూ ఈ పాటకు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో ఈమె వేసిన స్టెప్పులకు తెలుగు వారు సైతం ఫిదా అవుతున్నారు.మీరు కూడా ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు