పాపం.. ప్రియా వారియర్ కు చేదు అనుభవం.. అమర్యాదగా ప్రవర్తించారట!

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడానికి ఎన్నో సినిమాలలో నటించాల్సిన అవసరం లేదు.

చేసేది ఒక్క సినిమా అయినా అందులో ఒక్క సీన్ హైలెట్ అయినా ఆ సెలబ్రిటీలకు విపరీతమైన గుర్తింపు రావడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది.

అలా కేవలం కన్ను కొట్టే సీన్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన హీరోయిన్ ప్రియా వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒరు ఆడార్ ల‌వ్ సినిమాలో క‌న్ను కొట్టే సీన్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొని వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ కేర‌ళ కుట్టి ప‌లు తెలుగు సినిమాల్లో న‌టిస్తోంది.

తాజాగా ఆమెకు ఓ హోట‌ల్‌లో చేదు అనుభవం ఎదురైందని సదరు హోటల్ యాజమాన్యం తనతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా హోటల్లో జరిగిన అవమానాన్ని బయటపెట్టారు.ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే.

ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఈ ముద్దుగుమ్మ ఫెర్న్ గొరెగావ్ హోట‌ల్‌లో బ‌స చేసినట్లు తెలిపారు.అయితే ఈ హోటల్ పాలసీ ఏమిటి అంటే.

Advertisement

అక్కడ బస చేసిన వారు కేవలం ఆ హోటల్లో లభించే ఫుడ్ మాత్రమే తినాలి.బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ లోపలికి అనుమతించరు.

ఆ విషయం తెలియక ప్రియా వారియర్ బయట నుంచి తనకెంతో ఇష్టమైన ఫుడ్ తీసుకువచ్చింది.అయితే తన దగ్గర బయట ఫుడ్ ఉండటం వల్ల తనని హోటల్ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు.తను ఎంతో వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తన మాటలను హోటల్ సిబ్బంది పట్టించుకోకుండా తనని లోపలికి రానివ్వలేదని, ఒకవేళ లోపలికి రావాలంటే ఆ ఫుడ్ బయట పడేసి రావాలని తెలిపారు.

అయితే ఎంతో ఇష్టంగా బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ అలా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో అంత చలిలోనే ఆ ఫుడ్ తిని లోపలికి వెళ్ళినట్లు ఈ సందర్భంగా ప్రియా వారియర్ హోటల్ యాజమాన్యం తనకు చేసిన అవమానం గురించి సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు