బీజేపీ విమర్శల పట్ల కేసీఆర్ మౌనానికి కారణం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ ను మించిన రాజకీయ వ్యూహకర్త లేడన్న మాట సుస్పష్టం.

అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల వరకు తెలంగాణ కేసీఆర్ కు బలమైన ప్రతిపక్షం అనేది లేదు.

అయితే ఈ సారి గత ఎన్నికల కంటే ఈసారి కాస్త ప్రతిపక్షం నుండి బలమైన పోటీ మాత్రం ఏర్పడే అవకాశం ఉంది.కాని టీఆర్ఎస్ పై ఏ మాత్రం ప్రభావం పడే అవకాశం ఉండదని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం బీజేపీ విమర్శలే ఇక రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు అదనపు బలంగా మారే అవకాశం ఉంది.ఎందుకంటే ఇప్పటికే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు రకరకాల పరిశ్రమలను ఆహ్వానిస్తూ గ్లోబల్ ఇమేజ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బీజేపీ విమర్శలకు ఇప్పటి వరకు కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంపై తప్ప మిగతా ఏ ఒక్క విషయంలోనూ స్పందించని పరిస్థితి లేదు.కేసీఆర్ బీజేపీ విమర్శలపై స్పందించకపోవడానికి బలమైన వ్యూహం ఉంది.

Advertisement

  అయితే బీజేపీ ఏదైతే విమర్శలు చేస్తోందో వాటిని సమర్థవంతంగా తిప్పి కొడుతూనే పాలనపైనే పూర్తిగా దృష్టి పెడుతూ బీజేపీవి కేవలం రాజకీయ విమర్శలు అనే విధంగా ప్రజల్లోకి వెళ్తే ఇక బీజేపీ వ్యాఖ్యలేవి ఇక సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజల్లోకి వెళ్లకపోతే టీఆర్ఎస్ కు అదనపు బలంగా మారే అవకాశం ఉంటుందనేది టీఆర్ఎస్ ప్రధాన ఆలోచన.

ప్రస్తుతం చాలా వరకు బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య రాజకీయ వాతావరణం చాలా భీకర రీతిలో ఉన్న పరిస్థితుల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే ఎన్నికల పోరు జరిగే అవకాశం ఉంది.ఏది ఏమైనా మరి బీజేపీని రానున్న రోజుల్లో రాజకీయంగా ఎటువంటి వ్యూహంతో ఎదుర్కొంటారనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు