రామ్.. లింగుసామి.. పవర్ ఫుల్ టైటిల్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గా ది వారియర్ అని ఫిక్స్ చేశారు.

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల హిట్లతో కెరియర్ లో దూసుకెళ్తున్న రామ్ మరో పవర్ ఫుల్ సినిమాతో వస్తున్నారు.తెలుగులో పందెకోడి లాంటి హిట్ కొట్టిన డైరక్టర్ లింగుసామి ఈసారి రామ్ తో ది వారియర్ గా వస్తున్నాడు.

సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అందులో రామ్ పోలీస్ డ్రెస్ లో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నాడు.శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాలో ఆది పినిశెట్టి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

రామ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.మరి రెండు హిట్లు కొట్టి సూపర్ ఫాం లో ఉన్న రామ్ నెక్స్ట్ సినిమా కూడా హిట్ కొడతాడో లేదో చూడాలి.

ఈ సినిమాలో రామ్ డబల్ యాక్షన్ లో నటిస్తాడని టాక్.లింగుసామి, రామ్ కాంబో మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ది వారియర్ అంచనాలకు తగినట్టు ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు