ఆ డైరెక్టర్ కు మళ్ళీ అవకాశం ఇచ్చిన సామ్.. ఈసారి మరింత స్పైసీగా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ఆ బాధను మరిచిపోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, మరొక వైపు తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారింది ఈ బ్యూటీ.ఈ క్రమంలోనే టాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

విడాకుల తర్వాత సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో రకమైన కొటేషన్లు పెడుతూనే ఉంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగు కు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా సమంతకు మరొక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం దానికి సంబంధించిన లుక్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతోంది.

Advertisement

అయితే తాజాగా సమంత కు వచ్చిన వెబ్ సిరీస్ ను ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే లు డైరెక్టర్ ఉన్నారు అని తెలుస్తోంది.గతంలో ఈ దర్శకుల దర్శకత్వంలో ఫ్యామిలీ మెన్ 2 లో సమంతా ఒక ముఖ్య పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సమంతకు బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సమంత.ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాతో సమంతకు మంచి గుర్తింపు రావడంతో ఆమెకు 3 సినిమా ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ సమంత తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో సమంతకు ఆ సంస్థ భారీ రెమ్యూనరేషన్ ను ముట్ట చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు