కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో వేదిక, పరియా అబ్దుల్లా, సిమ్రత్ కౌర్ పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు.
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే.
అప్పట్లో ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక అదే సెంటిమెంట్ తోనే బంగార్రాజు సినిమాను సంక్రాంతి బరిలోకి దింపేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో జాతి రత్నాలు బ్యూటీ పరియా స్టెప్పులను ఇరగ దీసింది.
ఈ సినిమాలో మరొక పాట కోసం మరొక బ్యూటీ ని ఎంపిక చేశారు.ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన జాంబిరెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన దక్షా నగార్కర్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమా లోని చైతన్యతో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని ప్రత్యేకంగా ఎంపిక చేశారు.అందుకు సంబంధించిన షూటింగ్ ను ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో, అలాగే మైసూర్ లో షూట్ చేశారు.ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దక్షా నగార్కర్ బంగార్రాజు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.అయితే పాట కోసం తాను చాలా రిహార్సల్ చేసినట్టు తెలిపింది.

అయితే ఈ విషయంలో హీరో నాగచైతన్యకు చాలా ఓపిక అని, నాగచైతన్య రిహార్సల్స్ కోసం తనకు ఎంతో బాగా సహకరించాడని తెలిపింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.







