కృష్ణ, ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో వీరికి పుత్రశోకం తప్పలేదు?

చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులకు సంబంధించిన వారసులు ఇక అద్భుతంగా రాణిస్తారు అనుకుంటే అర్ధాంతరంగా అనారోగ్యంతో మరణించిన వారు చాలా మంది ఉన్నారు.

ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది సినీ ప్రముఖులకు పుత్రశోకం ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో కొడుకులను కోల్పోయిన సినీ ప్రముఖుల గురించి ఇపుడు తెలుసుకుందాం.సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు ఇటీవలే అనారోగ్యం బారిన పడి మరణించారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన రమేష్ బాబు 56 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించడంతో సూపర్ స్టార్ కృష్ణ ఎంత బాధలో మునిగిపోయారు.

సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇలాంటిదే జరిగింది.ఆయన కూడా కళ్ళముందే చేతికొచ్చిన కొడుకు మరణించడంతో పుత్ర శోకమే మిగిలింది.అరుదైన వ్యాధి వచ్చి అనారోగ్యంతో పెద్ద కొడుకు రామకృష్ణ కన్నుమూశారు.

Advertisement

ఈ బాధ నుంచి బయట పడడానికి ఎన్టీఆర్ కి చాలా రోజుల సమయం పట్టింది.అలాగే నందమూరి కుటుంబంలో హరికృష్ణకు కూడా పుత్రశోకంతో పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హరికృష్ణకు కూడా పుత్రశోకం మిగిలింది.

సీనియర్ రైటర్స్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘు బాబు అనారోగ్యంతో మరణించారు.ఇప్పటికీ తమ వారసుడిని గుర్తు చేసుకుంటూ ఆయన పేరుమీద నాటక వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు పరుచూరి బ్రదర్స్.

ఇక తన వారసుడిగా చిత్రపరిశ్రమలో రాణిస్తాడు అనుకున్నా కొడుకు అనారోగ్యంతో మృతి చెందడంతో పాటు విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు బాధలో మునిగిపోయారు.కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఈ బాధ నుంచి తేరుకోవడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది.

మరో నటుడు బాబు మోహన్ కు కూడా పుత్రశోకం తప్పలేదు.ఆయన కుమారుడు పవన్ కుమార్ యాక్సిడెంట్ లో మరణించాడు.హీరో అవుతాడు అని కలలు కన్న కొడుకు నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోయిన బాబు మోహన్ విలపించిన తీరు అభిమానులను కలిచివేసింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన గొల్లపూడి మారుతి రావుకు కూడా చేతికొచ్చిన కొడుకు ను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.ఆయన తనయుడు శ్రీనివాస్ సైతం చిన్నవయసులోనే తుదిశ్వాస విడిచారు.1992 ఆగస్టు 12వ తేదీన ఎప్పటిలాగానే షూటింగ్ స్టార్ట్ చేసిన శ్రీనివాస్ ఊహించని ప్రమాదంతో చివరికి ప్రాణాలు వదిలారు.

Advertisement

దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న తేజ కుమారుడు ఆరేళ్ళ వయసులోనే అనారోగ్యంతో మరణించాడు.కొడుకు పోయిన బాధ లో తేజ ఎన్నో ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి పోయాడు.క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించిన ప్రకాష్ రాజ్ కొడుకు సైతం అనారోగ్యం బారిన పడి ప్రాణాలు వదిలారు.

చిన్న వయసులోనే కొడుకు మరణం తట్టుకోలేక పోయిన ప్రకాష్ రాజు ఎంతగానో కుంగిపోయారు.

డాన్స్ మాస్టర్ గా దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించిన ప్రభుదేవా కొడుకు చిన్న వయసులోనే ప్రాణాలు వదిలాడు.ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.ఇలా చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులు దురదృష్టవశాత్తు వారి వారి వారసులను అర్ధాంతరంగా నే కోల్పోయారు.

" autoplay>

తాజా వార్తలు