చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా వచ్చే నెల 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది.ఈ నెల చివరినాటికి కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారకపోవచ్చు.
అయితే దేశంలో 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం టెన్షన్ నెలకొంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ అమలు చేయకపోయినా ఆంక్షలు అమలు చేసే ఛాన్స్ అయితే ఉంది.
ప్రస్తుతం చిరంజీవి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు.అయితే జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పాపులారిటీని సంపాదించుకున్న మహేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య సినిమాలో చిరంజీవిని తాను చిన్న పాత్ర ఇవ్వాలని అడిగానని ఆ తర్వాత చిరంజీవి చెప్పిన సమాధానం విని తాను షాకయ్యానని చెప్పుకొచ్చారు.
10 రోజుల ముందు వచ్చి ఉంటే ఆచార్య క్యారెక్టర్ నీకే ఇచ్చేవాడినని చిరంజీవి అన్నారని మహేష్ కామెంట్లు చేశారు.

ఆచార్య లొకేషన్ లో తనతో మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా మాట్లాడారని మహేష్ వెల్లడించారు.తన కామెడీ టైమింగ్ బాగుంటుందని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని మహేష్ అన్నారు.ఈ జబర్దస్త్ కమెడియన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రీఎంట్రీలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ కు కరోనా వైరస్ బ్రేకులు వేస్తుండటం గమనార్హం.

చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు సెట్స్ పై ఉండగా ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో క్లారిటీ రావాల్సి ఉంది.చిరంజీవి మాత్రం మరి కొన్నేళ్లు వరుస సినిమాలతో బిజీ కానున్నారని బోగట్టా.తన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.







