రైతు బంధు వారోత్సవాల నిర్వహణ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆసక్తిగా మారాయి.తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పధకాలలో ఒకటి రైతుబంధు పధకం.

అయితే రైతుబంధు పధకం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గుర్తింపు సాధించిన పరిస్థితుల్లో మరో విడత తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే.  అయితే గతేడాది కంటే ఈ సారి ఎక్కువ మంది రైతులకు రైతుబంధు లబ్ధి జరగడంతో రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు.

దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో పది రోజుల పాటు రైతు బంధు వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది.అయితే ఎన్నడూ లేనంతగా రైతు బంధు వారోత్సవాలు నిర్వహణ పిలుపుతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది.

అయితే ఈ వారోత్సవాల నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన వ్యూహం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్దం జరుగుతున్న పరిస్థితిలో బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ రణరంగం అనేది మొదలైందని చెప్పవచ్చు.

Advertisement

అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల వాతావరణం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో రైతులలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉంది కావున ఈ అభిప్రాయం వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడే అవకాశం ఉంది.అందుకు ప్రస్తుతం బీజేపీ చేస్తున్న ప్రచారాలతో  టీఆర్ఎస్ పై వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది కాబట్టి పార్టీగా రాజకీయంగా జాగ్రత్తగా ఉండకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా సరికొత్త సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో కెసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు