బండి సంజయ్ కు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతల కౌంటర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్ష మరో సారి రాజకీయంగా వేడిని రగిలిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అందుకే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తక్షణమే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేయాలని ఈనెల 27 న ఇందిరా పార్క్ లో నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే దీక్ష చేపట్టడం పట్ల టీఆర్ఎస్ నేతలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు లక్ష 35 వేల ఉద్యోగాలు కల్పించామని దేశ వ్యాప్తంగా ఎక్కువగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ప్రస్తుతం జోనల్ వ్యవస్థ ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోందని జనవరి 20 వరకు ఉద్యోగ ఖాళీలపై ఒక క్లారిటీ వస్తుందని ప్రస్తుతం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 85 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అందులో 65 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు  తెలుస్తోంది.

దీంతో కొత్త సంవత్సరంలో ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియాలో బండి సంజయ్ తలపెట్టిన దీక్షపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు వచ్చిన పత్రికా కథనాలను ప్రస్తావిస్తూ అసలు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.దీంతో ప్రస్తుతం బీజేపీ చేస్తున్న దీక్ష పట్ల కొంత రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టే విధంగా టీఆర్ఎస్ వ్యూహం కాస్త ఫలించిందని చెప్పవచ్చు.

Advertisement

మరి ఈ దీక్ష అంశం రాజకీయంగా ఇంకెంత రాజకీయ వేడిని రగిలిస్తుందనేది చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు