మనుషులు తోటి వారికి సాయం చేయడం ఎప్పుడో మానేశారు.ఈ గజిబిజి రొటీన్ లైఫ్ లో పడి టైమ్ మెషీన్ వెంబడి పరుగులు పెడుతున్నారు.
మన పక్క వారు ఎంత ఆపదలో ఉన్నా సరే మనకెందుకులే అని వదిలేసి వెళ్తున్నారు.అలా వెళ్తూ వెళ్తూ సాయం చేయడం మర్చిపోయారు.
ఎప్పుడైనా భవిష్యత్తులో ఆపద వస్తే ఎలా అన్న సంగతే మర్చిపోయారు.సాయం చేయడంలో నోరు ఉన్న మనుషుల కన్నా నోరు లేని మూగజీవాలే నయం అని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది.
మూగ జీవాలు ఇతర జీవులకు సాయం చేసే వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ప్రస్తుతం కూడా ఓ గేదె ఆపసోపాలు పడుతున్న మూగ జీవికి సాయం చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా గేదెలకు కోపం ఎక్కువ అని అందరూ చెబుతుంటారు.అందుకోసమే గేదెల జోలికి ఎవ్వరూ కూడా వెళ్లరు.తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీల్లో గేదెలను ఎక్కువగా వాడుతారు.అవి తమ కొమ్ములతో ఎదుటి వారిని ఈజీగా పడేస్తాయని చెబుతుంటారు.కానీ ఈ వీడియోలో మాత్రం ఓ గేదె, ఇసుకలో చిక్కుకుని ముందుకు కదలడానికి అవస్థలు పడుతున్న తాబేలుకు అవే కొమ్ములతో సాయం చేసింది.ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ టిక్ టాక్ యూజర్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సాయం చేయడంలో మాట్లాడే మనుషుల కన్నా మాటలు రాని మూగజీవాలే నయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కావాలంటే గేదె ఎలా సాయం చేసిందో మీరు కూడా వెంటనే చూసేయండి.మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరువకండి.







