నందమూరి బాలకృష్ణ.బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న అఖండ సినిమా మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ఈమద్య కాలంలో రెండు వారాలు వసూళ్లు గట్టిగా రాబట్టడమే పెద్ద విషయం.
మూడవ వారంలో వసూళ్లు అంటే దాదాపుగా అసాధ్యం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ప్రతి ఒక్క సినిమా కూడా మూడవ వారంలో వసూళ్లు అంటే గగనం అయ్యింది.
అఖండ కూడా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది.కనుక ఖచ్చితంగా మూడవ వారంలో వసూళ్లను ఆశించనక్కర్లేదు అంటున్నారు.
ఇక అఖండ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.వంద కోట్ల వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వర్షన్ దక్కించుకుంది.
ఇప్పుడు పుష్ప సినిమా అఖండ విజయాన్ని దక్కించుకుంటుందా అనే చర్చ మొదలు అయ్యింది.పుష్ప సినిమా భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది.

సినిమాకు దక్కిన మిశ్రమ స్పందనతో అఖండ వసూళ్లను ఈ సినిమా బీట్ చేస్తుందా అంటే పోటీ లేదు కనుక ఖచ్చితంగా వంద కోట్ల మార్కును దాటుతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.పుష్ప సినిమా కు వచ్చిన టాక్ ను బట్టి 125 కోట్ల రూపాయల వరకు సినిమా వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయంలో మరింత స్పష్టత అవసరం.పుష్ప మొదటి వారంలో వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేస్తే తదుపరి వారంలో ఆ పై వసూళ్లను దక్కించుకుంటుంది.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రెండు వందల కోట్ల టార్గెట్ తో విడుదల అయ్యింది.కాని ఇప్పుడు ఆ స్థాయిలో సినిమా వసూళ్లు సాధిస్తుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అభిమానులు మాత్రం 250 కోట్లు రాబట్టడం ఖాయం అంటున్నారు.మరి లాంగ్ రన్ లో పుష్ప ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.