లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రతి ఒక్క పాటను ఎంతో అద్భుతంగా రచించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ సినిమాలోని పాటల గురించి ఎన్నో విశేషాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ పుష్ప సినిమాలో సమంత నటించిన స్పెషల్ సాంగ్ గురించి కొన్ని సీక్రెట్స్ బయట పెట్టారు.
ఇప్పటివరకూ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో పాటల కంటే ఈ పాట మరింత ఎనర్జిటిక్ గా పవర్ ఫుల్ గా ఉండబోతోందని చంద్ర బోస్ తెలిపారు.ఈ పాటలు పుష్ప రాజ్ వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ ఈ పాట కొనసాగుతుందని చంద్రబోస్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఉహూ అంటావా అనే ప్రత్యేక గీతం నేడు విడుదల కానుంది.ఈ పాట సమాజంలోని ఓ అంశాన్ని కథగా మలిచి రాసిన పాట ఇందులో సమంతా చేసిన డాన్స్ అద్భుతంగా వర్కౌట్ అయిందని ఇదివరకు తను సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన జిగేలురాణి, డియ్యాలో, రింగ రింగ తరహాలో ఈ ప్రత్యేక గీతం ఉండబోతోందని ఈ సందర్భంగా చంద్రబోస్ తెలిపారు.