చిన్నారులతో కలిసి ఎంజాయ్ చేసిన ముఖ్యమంత్రి.. అంతే కాదు హెలికాప్టర్లో..?!

ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండి కూడా సాధారణ మనిషిలాగ చిన్న పిల్లలతో హెలికాఫ్టర్ ఎక్కి వాళ్ళతో సమయాన్ని గడిపిన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని నెటిజన్లు మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ కొంతమంది చిన్నారులను తన హెలికాప్టర్‌లో ఎక్కించుకుని సరదాగా ఆకాశంలో తిప్పుతూ ఆ పిల్లలకు ఎక్కడలేని ఆనందాన్ని కల్పించారు.

 Chief Minister Who Enjoyed With The Children Not Only In The Helicopter Cm, En-TeluguStop.com

విహంగ వీక్షణం తరువాత ఆ చిన్నారుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేము.ఇందుకు సంబంధించిన ఈ వీడియోను ముఖ్యమంత్రి చన్నీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

అలాగే ఆ పిల్లలు కూడా మొదటిసారి హెలికాప్టర్ ఎక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఏకంగా సీఎంతో ప్రయాణించడం అంటే మాములు విషయమా చెప్పండి.ఇలా పిల్లలతో కలిసి సరదాగా కాసేపు సమయం గడపడం పట్ల సీఎం చన్నీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.అలాగే పిల్లలతో ఛాపర్ రైడ్‌ చాలా థ్రిల్లింగ్ గా ఉందని తెలిపారు.

Telugu Charan Jith, Punjab Cm, Latest-Latest News - Telugu

నేటి బాలలే రేపటి పౌరులు.అన్నట్టుగా వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు మంచి బాటలు వేయడమే తమ ప్రయత్నమంటూ చరణ్‌జిత్ సింగ్ చన్నీ వీడియో పోస్ట్ చేస్తూ ట్వీట్టర్లో రాసుకొచ్చారు.అలాగే సీఎం తో హెలికాఫ్టర్ ప్రయాణం చేసిన చిన్నారులతో కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడగా ఆ పిల్లలు ఆనందంతో అక్కడే గెంతులేశారు.ఫస్ట్ టైమ్ హెలికాప్టర్‌ ఎక్కామని, అది కూడా ముఖ్యమంత్రితో అని తెగ సంబరపడిపోయారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సీఎం ను పొగిడే పనిలో పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube