టీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ 'వరి దీక్ష ' ! సీనియర్ల సహకారం ఎంత ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ ముందుకు కదులుతోంది.

ఉద్యమాలు ఆందోళన చేపట్టడం ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలనే ఉద్దేశంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు .

ఈ మేరకు  తెలంగాణలో రైతు సమస్యలపై కాంగ్రెస్ గళం విప్పేందుకు సిద్ధమైంది.యాసంగి వరి సాగు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని తప్పు పడుతూ వారు దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది.

కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టే ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో పాటు,  తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా పాల్గొంటారని ఆ పార్టీ ప్రకటించింది .ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి దీక్ష మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు .శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కాంగ్రెస్ నేతలంతా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు.ఈ సందర్భంగా వారి దీక్షకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చే విధంగా , ఈ సభను సక్సెస్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కాంగ్రెస్ చేసింది.

  ఇప్పటికే కల్లాల్లో కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు జిల్లాలో పర్యటన చేపట్టాయి.అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు .ప్రస్తుతం వానలు ఎక్కువ కురుస్తున్నాయి అని, తడిచి మొక్కలు వస్తున్నాయని, అయినా  ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం వరి దీక్ష ద్వారా కాంగ్రెస్ కు రైతుల మద్దతు ఉండేలా చేసుకుంటున్నారు.  అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు అంతా తరలివస్తారని, ఈ దీక్షను సక్సెస్  చేస్తారని రేవంత్ రెడ్డి ఆశిస్తుండగా కాంగ్రెస్ సీనియర్లు సహకారం అంతంత మాత్రంగానే ఉండేలా కనిపిస్తోంది.  ఈ దీక్షలు సక్సెస్ అయితే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుందనే అభిప్రాయం లో ఉన్నారు తప్ప కాంగ్రెస్ కు ఇది కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపించడం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు