శివ శంకర్ మాస్టర్ కు సోనూ సూద్ సాయం..!

ప్రముఖ కొరియోగ్రాఫర్, క్లాసికల్ డ్యాన్సర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతున్నారు.

లంగ్స్ లో 70 శాతం వరకు ఇంఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.

ఓ పక్క శివ శంకర్ మాస్టర్ తనయుడు కూడా కరోనాతో బాధపడుతున్నారట.ఆయన అవుట్ ఆఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇంట్లో శివ శంకర్ మాస్టర్ సతీమణి కూడా కరోనాతో హోం క్వారెంటైన్ లో ఉన్నారట.ఇక శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం ఆర్ధిక సాయం అడుగుతున్నారు.

అయితే ఎక్కడ ఆపద అంటే అక్కడ ప్రత్యక్షమయ్యే సోనూ సూద్ శివ శంకర్ మాస్టర్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు.శివ శంకర్ మాస్టర్ కోలుకునేందుకు ఎలాంటి సాయమైనా చేస్తానని సోనూ సూద్ తన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

Advertisement

ఇప్పటికే కరోనా టైం లో ఎంతోమందికి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్ ఇప్పటికి తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండగా వైద్యులు ఆయనకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

 శివ శంకర్ ట్రీట్ మెంట్ కు ఆర్ధిక సాయం చేస్తున్న సోనూ సూద్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు