బిగ్ బాస్ హౌస్ నుంచి అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఇవే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్ 5 నుంచి 11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.అనీ మాస్టర్ ఎలిమేనేట్ కావడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.

అనీ మాస్టర్ టాప్ 5లో ఉంటారని భావించామని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి ఐదో కంటెస్టెంట్ గా అనీ మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ షోలో హౌస్ మేట్స్ అందరితో ఆమె కలివిడిగా ఉండేవారు.అయితే తర్వాత రోజుల్లో చిన్నచిన్న విషయాలకు కూడా బిగ్ బాస్ హౌస్ లో అసహనం వ్యక్తం చేస్తూ అనీ మాస్టర్ వార్తల్లో నిలిచారు.

బిగ్ బాస్ హౌస్ లో పురుషులను అనీ మాస్టర్ ఎక్కువగా నామినేట్ చేసేవారు.టాస్క్ ల సమయంలో సక్సెస్, ఫెయిల్యూర్ ను ఆమె సమంగా చూసేవారు కాదు.

ఎవరైనా గేమ్ కు అడ్డుపడితే అనీ మాస్టర్ గట్టిగా అరిచేవారు.కెప్టెన్సీ టాస్క్ లో ఎప్పుడైనా ఓడిపోతే అనీ మాస్టర్ తట్టుకునేవారు కాదు.

అయితే వంట చేసే సమయంలో మాత్రం ఎంతో ఓర్పుతో అనీ మాస్టర్ ఆ పనిని పూర్తి చేసేవారు.

కాజల్ ను శత్రువులా చూసిన అనీ మాస్టర్ సన్నీ, శ్వేతలతో మాత్రం ఆప్యాయతతో మెలిగేవారు.కాజల్ నామినేట్ చేస్తే గట్టిగా అరవడం, హేళనగా మాట్లాడటం, వెక్కిరించడం, ముఖాన నీళ్లు కొట్టడం లాంటి పనులు చేయడం ద్వారా ప్రేక్షకుల్లో అనీ మాస్టర్ పై చెడు అభిప్రాయం ఏర్పడింది.

అయితే అనీ మాస్టర్ తాను ఏ మాత్రం అమర్యాదగా ప్రవర్తించలేదని వెల్లడించేవారు.ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో కూడా అనీ మాస్టర్ కాజల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.అనీ మాస్టర్ ను నాగార్జున కన్ఫెషన్ రూమ్ కు పిలిపించి పద్ధతి మార్చుకోవాలని ఆమెకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు