యూనివర్శిల్ స్టార్ 'విక్రమ్‌' వచ్చేది ఎప్పుడంటే..!

కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలు ఎప్పుడైనా జనాల్లో విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉంటాయి.

అలాంటిది ఆయన లోకేష్‌ కనగరాజ్ వంటి విలక్షణ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ క్రేజీ సినిమా లో విలక్షణ నటులు ఇద్దరు విజయ్ సేతుపతి మరియు పాహద్ ఫాజిల్ లు నటిస్తున్నారు.దాంతో ఈ సినిమా భారీ మల్టీ స్టారర్‌ సినిమా మారిపోయింది.

కమల్‌ తో పాటు ఆ ఇద్దరికి కూడా పాన్ ఇండియా గుర్తింపు ఉంది.అందుకే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

తన గత చిత్రాల విజయాల నేపథ్యంలో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడంతో పాటు గత సినిమాలను మించిన విధంగా తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Advertisement

ముగ్గురు స్టార్‌ నటులను ఒకే సినిమాలో చూపించడం అంటే మామూలు విషయం కాదు.ఇందుకోసం ఆయన గొప్ప కథను ఎంపిక చేసుకున్నాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 31న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు టార్గెట్‌ గా ఈ సినిమా ను సమమ్ర్ స్పెషల్‌ గా విడుదల చేస్తున్నారు.

ప్రతి కమల్‌ అభిమానితో పాటు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విక్రమ్‌ సినిమా ను తమిళంలో రూపొందించిన తెలుగు.కన్నడం.

మలయాళం మరియు హిందీల్లో భారీ ఎత్తున విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.కమల్‌ హాసన్‌ స్వయంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు