మీకేనా గౌరవం .. మాకు లేదా ? బాబు కు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ మినహా అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.

నిన్న శాసనసభలో వైసిపి సభ్యులు కొంతమంది చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి కన్నీళ్లు కార్చిన ఘటనపై ఆయన పై సానుభూతి వ్యక్తమవుతోంది.

టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.వివిధ ప్రజా సంఘాలు,  నాయకులు చంద్రబాబు కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా టిడిపి నేతలు మరింత ఘాటుగా జాలంతో వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్న క్రమంలో,  ఆ పార్టీ నాయకులు అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు.  మీకు కుటుంబాలు ఉంటాయి మీకు గౌరవం ఉంటుంది.

మా కుటుంబాలకు గౌరవం లేదా అని ప్రశ్నిస్తూ మంత్రి కొడాలి నాని , ఎమ్మెల్యే రోజా, వల్లభనేని వంశీ వంటి వారు స్పందించారు.       టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని రోజా గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.

Advertisement

రోజా బ్లూ ఫిలిం లో నటిస్తుంది అంటూ పీతల సుజాత అసెంబ్లీ వద్ద  మాట్లాడినప్పుడు మాకు కుటుంబాలు లేవా మాకు గౌరవం లేదా ? ఇప్పుడు చంద్రబాబు కుటుంబానికి అవమానం జరిగిందని బాధపడుతున్నారు అంటూ విమర్శించారు .ఇక టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు అని, ఇదంతా ఫ్రీ ప్లాన్ డ్రామా అంటూ మండిపడ్డారు.

మళ్లీ పదవి కోసం చంద్రబాబు జయప్రదంగా నటిస్తున్నాడని విమర్శించారు.మాధవ రెడ్డి పేరు ఎత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావ్ అంటూ విమర్శించారు.   

  మరి నీ పుత్రరత్నం పప్పు నాయుడు మమ్మల్నందర్నీ విమర్శించినప్పుడు నీ పెద్దరికం ఏమైంది ? ఇంగిత జ్ఞానం ఏమైంది అంటూ వంశీ ప్రశ్నించారు.చంద్రబాబు మా కుటుంబం పై విమర్శలు చేయించినప్పుడు ఏమైందని,  మా కుటుంబాలకు గౌరవం లేదా  అంటూ ప్రశ్నించారు .మా భార్య పిల్లలు మా పై వస్తున్న విమర్శలను చూసి బాధపడకు అంటూ ప్రశ్నించారన్నారు.అయినా ఊరికే ఏడ్చే మగ వాడిని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.

అది నీ లాంటి వాడిని చూసి చెప్పే ఉంటారు అంటూ వంశీ విమర్శించారు.ఇక చంద్రబాబు ఏడుపును నటన అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఒకపక్క చంద్రబాబు కన్నీళ్ల పై పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో , వైసీపీ నాయకులు అవేమి పట్టించుకోకుండా తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టినా మరింతగా టిడిపి నాయకులను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు