గంగూలీకి దక్కిన మరొక అరుదైన గౌరవం..!

సౌరవ్ గంగూలీ ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి.ఎందుకంటే వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ లో గంగూలీ కూడా ఒకరు.

క్రికెట్ అభిమానులు అయితే ఆయన పేరు వింటే చాలు ఉబ్బితబ్బిబ్బై పోతారు.భారత జట్టు కెప్టెన్‌గా గంగూలీ ఎప్పుడు కూడా అత్యుత్తమ పెరఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి.

అక్టోబర్ 2019లో బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యి పదవిలో కొనసాగుతున్నారు.అయితే బీసీసీఐ అధ్యక్షుడైన రెండో క్రికెటర్‌ గా గంగూలీ గుర్తింపు సాధించాడు.

అలాంటి ఒకప్పటి మన టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా మరోక పదవిని చేపట్టనున్నారు.ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ) క్రికెట్ కమిటీకి కొత్త ఛైర్మన్ గా నియమితులయ్యారు.

Advertisement

బుధవారం ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది.ఐసీసీ చైర్మన్ హోదా లో అంతకముందు ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇప్పుడు అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.దాదాపు మూడేళ్ల పాటు ఉండే ఈ ఐసీసీ చైర్మన్ పదవిని గరిష్ఠంగా మూడు సార్లు అనిల్ కుంబ్లే పూర్తి చేయడంతో ఆయనే స్వయంగా పదవిలో నుంచి తప్పుకుంటున్నారు.

ఆయన స్థానంలో ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ బాధ్యతలు అందుకోనున్నారని ఐసీసీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తెలుస్తుంది.అలాగే గంగూలీని మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అని, అప్పటి జనరేషన్ లో బెస్ట్ బ్యాట్స్ మన్ అంటూ ఐసీసీ గంగూలీని అభివర్ణించింది.అలాగే తొమ్మిదేళ్ల పాటు సేవలందించిన అనిల్ కుంబ్లేకు థ్యాంక్స్ చెబుతూ సౌరవ్ కు ఇదే మా స్వాగతం అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నారు.

వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ లో ఒకరైన గంగూలీ గేమ్ అనుభవం మన క్రికెట్ ఆటగాళ్లకు బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నానన్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు