దొంగ బుద్ధి ఎక్కడకు వెళ్లినా అస్సలు మారదు.అది దేవుడి గుడి అయినా పోలీసుల ఇళ్లు అయినా వారికి తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం.
అయితే ఇప్పుడు దొంగలు ఎంతలా తెలివి మీరుతున్నారో చూస్తున్నాం.దొంగతనం చేయడంలో కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు.
ఎక్కడ ఎలా మెదులుకోవాలో బాగా తెలుసుకుంటున్నారు.పైగా మామూలు మనుషుల్లాగే అన్ని సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారండోయ్.
ఏంటి నమ్మట్లేదా అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మీరే తెలుసుకుంటారు.ఇప్పుడు మనం ఓ భక్తి గల దొంగ గురించి తెలుసుకుందాం.
మామూలుగా దొంగలు గుడుల్లో ఎత్తుకెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఇలా దొంగతనం చేసే టప్పుడు వారు కనీసం దేవుడు ఉన్నాడనే భక్తి, భయం లాంటివి లేకుండా ఎత్తుకెళ్తుంటారు.
దేవుడి గుడిలోకే చెప్పులు వేసుకుని దేవుడి మీద ఉన్న బంగారు ఆభరణాలు లేదంటే బయట ఉన్న హుండీలను ఎత్తుకెళ్లడం మనం చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఓ దొంగ ఇలాగే గుడిలోకి ఎంట్రీ ఇచ్చాడు.
గుడిలోకి రాగానే ఫోన్ తో ఏదో ఫొటోలు తీస్తున్నట్టు బిల్డప్ కొట్టాడు.ఇక ఎవరూ లేరని నిర్ధారించుకుని బయట ఉన్న హుండీ మీద కన్ను వేశాడు.
అయితే హుండీని ముట్టే ముందు ఏదో పెద్ద భక్తుడిలా దేవుడికి దండం పెట్టి ఏవేవో కోరుకుంటున్నట్టు కనిపించాడు.ఇక ఆ తర్వాత నెమ్మదిగా హుండీ దగ్గరకు వచ్చి దాన్ని ఎత్తుకొని లగెత్తాడు.వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించుకున్నాడు.
ఇదంతా కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
దీన్ని చూసిన వారంతా దొంగోడి భక్తికి లాఠీ దెబ్బలే కరెక్టు అని కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరేమో ఫన్నీగా సీసీ కెమెరాలు చూసుకుని పని చేయాలి కదా బ్రో అంటూ మీమ్స్ పెట్టేస్తున్నారు.
.