కృష్ణవంశీ రంగమార్తాండలో మెగాస్టార్ చిరంజీవి..!

ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా సెన్సేషనల్ హిట్లు అందుకున్న కృష్ణవంశీ ఇప్పుడు కెరియర్ పరంగా పూర్తిగా వెనకపడ్డారు.

నక్షత్రం తర్వా అడ్రెస్ లేకుండాపోయిన కృష్ణవంశీ మరాఠి సినిమా నట సామ్రాట్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

రంగమార్తాండ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక వంటి స్టార్స్ నటిస్తున్నారు.సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి హెల్ప్ తీసుకుంటున్నాడు కృష్ణవంశీ.రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తుంది.సినిమాకు చిరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని టాక్.

ఆ వాయిస్ ఓవర్ తోనే సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.తప్పకుండా రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.

Advertisement

త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అంటున్నారు.కృష్ణవంశీ మరోసారి తన ప్రతిభ ఈ సినిమాతో చూపించాలని ఫిక్స్ అయ్యారు.

 మరి రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఏమేరకు హెల్ప్ అవుతుంది అన్నది చూడాలి.ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, అలి రెజాలు కూడా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు