ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా చాలామంది కంచె సినిమా ఆమె మొదటి సినిమా అని భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో గ్లామరస్ గా కనిపించే హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు.అయితే ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఒక విషయం తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
కంచె సినిమాతో ప్రేక్షకుల్లో ప్రగ్యా జైస్వాల్ కు మంచి గుర్తింపు దక్కింది.కంచె మూవీలో క్రిష్ ప్రగ్యా జైస్వాల్ ను అందంగా చూపించడంతో పాటు ప్రగ్యా జైస్వాల్ అభినయం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
కంచె సినిమాలో నటనకు ప్రగ్యా జైస్వాల్ కు అవార్డులు కూడ దక్కడం గమనార్హం.అయితే ప్రగ్యా జైస్వాల్ కంచె మూవీలో నటించక ముందే రెండు సినిమాలలో నటించారు.
అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రగ్యాకు పేరు రాలేదు.

ప్రగ్యా జైస్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా డేగ కాగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైందనే సంగతి కూడా చాలామంది అభిమానులకు తెలియదు.డేగ తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో ప్రగ్య నటించగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.అయితే ఈ సినిమాల వల్ల క్రిష్ దృష్టిలో పడిన ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలను అందుకున్నారు.