నా లైఫ్ ని ఒక్క నిమిషంలో మార్చేశాడు.. చిరంజీవిలో ఉన్న గొప్పతనం అది: సీనియర్ జర్నలిస్ట్

ప్రముఖ నటుడు చిరంజీవి అంటే ఒక నటుడిగా, గొప్ప డాన్సర్ గా మాత్రమే తెలుసు.

కానీ ఆయనలో ఒక సేవ భావం, దయా గుణం కూడా ఉన్నాయని కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతం అవుతుంది.

ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు.అలాగే ఎవరు ఆపదలో ఉన్న కూడా వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు.

అందుకు ఉదాహరణే ఈ వివరణ.ఒకప్పుడు తాను శివరంజనికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నపుడు తనకు ఎదురైన అనుభవాలను సీనియర్ జర్నలిస్ట్ గిరిధర్ ఇలా చెప్పుకొచ్చారు.

యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు పాల్గొన్న గిరిధర్ తన జీవితంలో వచ్చిన మార్పులను, అందుకు గల కారణాలను ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక వివరాల్లోకి వెళితే చిరంజీవిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఎదుటి వారు ఏదన్నా ప్రాబ్లెమ్ లో ఉన్నారన్నా కూడా గుర్తించే వ్యక్తి అని ఆయన అన్నారు.

Advertisement

ఆయన్నే అంతగా అడిగే సరిగి జరిగింది చెప్పేశాను అని గిరిధర్ తెలిపారు.ఆ పక్కనే ఖైదీ ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి ఉన్నారు.

అప్పుడు వెంటనే మన గిరిధర్ గురించి మాగుంటి అన్నతో చెప్పు, ఏదన్నా అవకాశం ఉందేమో చూడాల్సింది అని తాను అన్నట్టు ఆయన చెప్పారు.వెంటనే ఆయన వెళ్లి తిరుపతి రెడ్డికి చెప్పడంతో, ఒక్క నిమిషంలోనే అంత సెట్ అయిందని ఆయన చెప్పారు.ఒక లైఫ్ టర్న్ అవ్వాలంటే ఒక్క నిమిషం చాలని ఆయన వివరించారు.

కరెక్ట్ గా ఆ నిమిషమే తన లైఫ్ టర్న్ అయిందని ఆయన అనందం వ్యక్తం చేశారు.ఆ వెంటనే మూడో రోజే తనకు శివరంజని నుంచి అప్పాయింట్ మెంట్ లెటర్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు