న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు

దేశంలోని ఏపీ తెలంగాణ లతో పాటు అనేక రాష్ట్రాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

 

2.అబ్దుల్ కలాం పై పవన్ కళ్యాణ్ కామెంట్స్

  మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 90 జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఆయనకు నివాళులు అర్పించారు.అబ్దుల్ కలాం అచంచల దేశ భక్తుడు అంటూ కొనియాడారు. 

3.జగన్ పాలన పై డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు

  జగన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పాలన చూడలేదని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

4.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కొనసాగుతోంది శుక్రవారం తిరుమల శ్రీవారిని 30,442 మంది భక్తులు దర్శించుకున్నారు. 

5.పుదుచ్చేరిలో కర్ఫ్యూ పొడగింపు

  పుదుచ్చేరి లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను 31వ తేదీ వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

6.రైల్వేస్టేషన్ లో పేలుడు ఆరుగురు జవాన్లకు గాయాలు

  చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది.ఈ ఘటనలో సిఆర్పిఎఫ్ కు చెందిన ఆరుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. 

7.సోనియాగాంధీ వార్నింగ్

Advertisement

  ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పార్టీలోని అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు.పార్టీ నియమాలకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని వదిలిపెట్టబోము అంటూ ఆమె హెచ్చరించారు. 

8.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

9.కౌబాయ్ పాత్రలో ధనుష్

  ధనుష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది.విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వి క్రియేషన్స్ అధినేత కలై పులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో నానే వరివేన్ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఇందులో ధనుష్ కౌబాయ్ గెటప్ లో కనిపించారు. 

10.శిల్పాశెట్టి ఆమె భర్తపై హీరోయిన్ ఫిర్యాదు

  బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా పై హీరోయిన్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అక్టోబర్ 14 వ తేదీ తనను మోసం చేయడంతో పాటు, మానసిక వేధింపులకు పాల్పడినందుకే షెర్లిన్ చోప్రా ఈ కేసు పెట్టినట్టు తెలిపారు. 

11.వైసీపీ పై లోకేష్ విమర్శలు

   వైసీపీ ప్రభుత్వం , ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.ఏపీ ని అంధకార ప్రదేశ్ గా జగన్ మార్చేశారు అంటూ విమర్శలు చేశారు. 

12.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ విమర్శలు

  పచ్చని సంసారం లో సైతం కెసిఆర్ చిచ్చు పెడతారు అంటూ.హుజురాబాద్ బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. 

13.డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన నాగార్జున

  ప్రముఖ నటుడు నాగార్జున ఫిలిం నగర్ లో డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.తన చిరకాల మిత్రుడు సాయి డెంటల్ క్లినిక్ అధినేత ఏ.పీ మోహన్ కొత్తగా ఫిలిం నగర్ లో పెట్టిన ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నాగార్జున హాజరయ్యారు. 

14.టీమ్ ఇండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్

  భారత క్రికెట్ టీం ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ నియమించింది. 

15.మంచు విష్ణు ప్యానల్ ప్రమాణ స్వీకారం

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

  మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు , ఆయన ప్యానల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 

16.శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

  శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ అంగీకరించారు.ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 

17.బన్నీ ఉత్సవం లో హింస .100 మందికి గాయాలు

Advertisement

  కర్నూలు జిల్లాలోని హోళ గుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ జైత్రయాత్ర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది.ఈ ఉత్సవం లో చెలరేగిన హింస లో సుమారు 100 మంది గాయాల పాలయ్యారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

18.ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు

  తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ముగిశాయి. 

19.నేడు తెరుచుకున్న శబరిమల ఆలయం

  కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శనివారం తెరుచుకోనుంది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,080   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,080.

తాజా వార్తలు