మతి మరుపు వ్యాధి తో ఇబ్బంది పడుతున్నారా... అయితే వీటిని తినడం తగ్గించండి..!

మీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అయిన పిజ్జాలు, చిప్స్, వంటి వాటిని తినడానికి ఇష్ట పడుతున్నారా.

అయితే ఇకమీదట మీరు మీ ఇష్టాన్ని కంట్రోల్ చేసుకోక తప్పదు.

ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినడం వలన భవిష్యత్తులో మన మెదడు పనితీరు మందగిస్తుందట.ఫలితంగా మన మెదుడు పని తీరు తగ్గడంతో మెల్ల మెల్లగా జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని తాజాగా జరిగిన పరిశోధనల్లో తేలింది.

అంతేకాకుండా ప్రాసెస్ట్ ఫుడ్స్ తినటం వల్ల చాలా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.బరువు పెరగటంతో పాటు , షుగర్ వ్యాధి బారిన పడడం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

వీటితో పాటు తాజాగా జరిగిన పరిశోధనల్లో ఫాస్ట్ ఫుడ్ తినడం వలన మెదడు పని తీరు కూడా తగ్గుతుంది అనే అంటున్నారు.ఒక ప్రముఖ జర్నల్ ప్రచురించిన కధనం ప్రకారం హెల్దీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వాటిలో ఎక్కువగా నిల్వ పదార్ధాలు మాత్రమే కాకుండా అధికంగా కొవ్వు కలిగిన పదార్ధాలు కూడా ఉంటాయి.

Advertisement

అలాగే వాటిని చూడగానే అట్రాక్షన్ అవ్వడానికి వాటిలో ఆర్టిఫిషియల్ రంగు కలుపుతారు.నోటికి రుచిగా ఉండడానికీ కావలిసిన ఫ్లేవర్స్ కూడా మిక్స్ చేస్తారు.

అందుకనే అలాంటి ఫుడ్ తీసుకుంటే మెమొరీ లాస్ అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.కాగా పిజ్జాలు, ఇతర జంక్స్ ఫుడ్స్ అనారోగ్యకరమైన పదార్ధాలతో తయారు చేయబడతాయి.

తాజాగా ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయట పడింది.ఇలాంటి ఫుడ్ తిన్న ఎలుకల్లో మెదడు పనితీరు మందగించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇలాంటి ప్రాసెస్ ఆహారాన్ని తీసుకున్న వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధితో పాటు మర్చిపోవడం వంటి లక్షణాలను కనుగొన్నట్లు ఒహియో స్టేట్ యూనివర్శిటీ సీనియర్ పరిశోధకులు రూత్ బారింటోస్ తెలిపారు.

అందుకే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది అని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ మధ్య కాలంలో పిల్లలు అయితే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇప్పటి నుండి వాళ్ళు ఇలాంటి హానికరమైన ఆహారాన్ని తింటుంటే భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకుని ఇప్పటికైన జాగ్రత్త పడితే మంచిది.

Advertisement

తాజా వార్తలు