ఈ కుక్క బిజినెస్ ఎలా చేయాలో చెప్తోందంటున్న ఆనంద్ మ‌హీంద్రా..

కుక్కేంటి ? బిజినెస్ ట్రిప్ చెప్ప‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారా.యెస్ కుక్కే బిజినెస్ ఎలా చేయాలో చెప్పింది.

కేవ‌లం అదే కాదు ప్ర‌కృతిలో ఉన్న అనేక జీవరాశుల నుంచి మ‌నం చాలా విష‌యాలు తెలుసుకోవ‌చ్చు.తెలుసుకుంటున్నాం కూడా.

ఈ విష‌యం మ‌రెవ‌రో చెప్పంది కాదు.ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మ‌హీంద్ర చెప్పింది.

బిజినెస్ చేయ‌డంలో ఆనంద్ మ‌హీంద్ర‌కు మంచి పేరుంది.ఎంబీయే స్టూడెంట్ల‌కు, కొత్త‌గా వ్యాపారంలోకి రావాల‌న‌కుంటున్న యువ‌త‌కు ఆనంద్ మ‌హీంద్ర‌ను ఒక రోల్ మోడ‌ల్‌గా చూపిస్తారు.

Advertisement

కేవ‌లం బిజినెస్ అనే కాదు స‌మాజిక అంశాల ప‌ట్ల కూడా ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తారు ఆయ‌న‌.సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.

త‌న‌కు న‌చ్చిన వీడియోల‌ను, ప్ర‌దేశాల‌ను, కోటేష‌న్ల‌ను త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా షేర్ చేస్తుంటారు.అలా షేర్ చేసే వాటికి త‌న అభిప్రాయాన్ని కూడా జ‌త చేస్తుంటారు.

గ‌తంలో ఈయ‌న చేసిన ట్వీట్ లు చాలా వైర‌ల్‌గా మారాయి.ఇందులో కొన్ని సామాజికాంశాల‌కు చెందిన‌వి ఉంటే, మ‌రి కొన్ని ప్ర‌కృతికి సంబంధించిన‌వి ఉన్నాయి.

అయితే మ‌నం ఇప్పుడు చ‌ర్చించుకోబోతున్న అంశం కూడా ఆనంద్ మ‌హీంద్ర వెలుగులోకి తీసుకువ‌చ్చిందే.ఒక గాజు గ‌దిలో కుక్క‌ను ప‌ట్టుకొని దాని య‌జమాని ఉంటాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నిజానికి ఒక డోర్ కు గాజు ఉండ‌కుండా ఖాళీగానే ఉంటుంది.కానీ కుక్క మాత్రం గాజు ఉంద‌నుకొనే భావ‌న‌తో దానిని నెడుతుంది.దీనిని చూసి దాని య‌జ‌మాని ముసి ముసిగా న‌వ్వుతాడు.

Advertisement

ఇదంతా వీడియోలో రికార్డ్ చేశారు.ఈ వీడియోను చూసిన ఆనంద్ మ‌హీంద్ర త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు.

కుక్క మ‌న వ్యాపారవేత్త‌ల‌కు బిజినెస్ ఎలా చేయాలో చెప్తోంది.మ‌నం కూడా ఒకే రీతిలో బిజినెస్ చేస్తుంది.

కొత్తగా చేయ‌డానికి ట్రై చేయ‌డం లేదు.అంటూ త‌న అభిప్రాయాన్ని జ‌త చేశారు.

తాజా వార్తలు