'ఆర్ఆర్‌ఆర్‌' రిలీజ్ డేట్ మారనుందా.. నిర్మాతల మండలి సూచన!

కరోనా వల్ల ఏడాదిన్నర కాలంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ కూడా ఒక్కసారి విడుదలకు సిద్దం అవుతున్నాయి.

సంక్రాంతికి నాలుగు అయిదు పెద్ద సినిమాలు విడుదల అవ్వాలని రెడీ అయ్యాయి.

వాటికి తోడు ఆర్‌ ఆర్‌ ఆర్ ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.సంక్రాంతికి వారం రోజుల ముందు ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను విడుదల చేయాలని నిర్ణయించడంతో పాటు ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయి.

ఈ సమయంలో నిర్మాతల మండలి సభ్యులు పెద్ద సినిమాల విడుదల విషయంలో చర్చ జరపడం జరిగింది.ఆ చర్చలో పెద్ద సినిమాల మద్య కనీసం వారం నుండి రెండు వారాల గ్యాప్ తప్పకుండా ఉండాలని.

ఒక వేళ పండగకు విడుదల అయితే ఒకటి లేదా రెండు రోజులు అయినా గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది.ఇక ఆర్‌ ఆర్‌ ఆర్ విడుదల తేదీని మార్చుకోవాల్సిందిగా నిర్మాతల మండలి సూచించినట్లుగా తెలుస్తోంది.

Advertisement

నిర్మాతల మండలి సభ్యులు మరియు బడా నిర్మాతల సూచన మేరకు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను వచ్చే సంక్రాంతికి ముందు కాకుండా సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేస్తారని తెలుస్తోంది.ఇక పుష్ప సినిమా స్థానంలో ఆచార్య వస్తుందని వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది.ఎందుకంటే సంక్రాంతి ముందు ఆచార్య రాబోతుంది.

అంటే ఆచార్య విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ ను ముందు ముందు అయినా క్లీయర్ చేస్తారేమో చూడాలి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య మరియు ఆర్‌ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీలు మరియు ఇతర విషయాలు చాలా ఆసక్తిని కలుగజేస్తున్నాయి.

ఆర్ ఆర్‌ ఆర్ విడుదల తేదీ విషయంలో మళ్లీ మార్పు రావడం పట్ల అభిమానులు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు