టీఆర్ఎస్ లోకి మోత్కుప‌ల్లి ఎంట్రీకి లైన్ క్లియ‌ర్‌.. కీల‌క ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన కేసీఆర్‌?

కేసీఆర్ ఎప్పుడైతే హుజూరాబాద్‌లో ద‌ళితుల‌ను టార్గెట్ చేసి ద‌ళిత బంధు స్కీమ్ తెర‌మీద‌కు తెచ్చారో అప్ప‌టి నుంచే చాలామంది ద‌ళిత నేత‌ల‌ను ఆయ‌న ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి సంచల‌నం రేపారు.

అయితే ఆయ‌న గ‌తంలో టీడీపీలో ఉండ‌గా కేసీఆర్ మీద దుమ్మెత్తి పోశారు.కానీ రీసెంట్ గా బీజేపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

ఇక ఇదే స‌మ‌యంలో కేసీఆర్ మీద ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.కార‌ణాలు ఏమైనా కూడా మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయిపోయారు.

ఇక ద‌ళిత బంధు స్కీమ్‌లాంటివి కేసీఆర్ ప్ర‌వేశ పెట్ట‌డంతో ద‌ళితుల‌కు ఆయ‌న చేస్తున్న మంచి ప‌నులకు ఆక‌ర్షితుడినై ఇలా చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించేశారు.దీంతో ఆయ‌న చేరిక అనివార్యం అయిపోయింది.

Advertisement

కానీ ఎప్పుడు చేరుతార‌నేదానిపై మొన్న‌టి దాకా క్లారిటీ రాలేదు.ఆయ‌న బీజేపీకి గుడ్ బై చెప్పి చాలా రోజులు అవుతున్నా కూడా టీఆర్ఎస్‌లో చేరిక‌పై నిన్న లైన్ క్లియ‌ర్ అయిపోయింది.

త్వ‌ర‌లోనే ఆయ‌న చేరిక ఉంటుంద‌ని తెలుస్తోంద‌తి.

మొన్న కేసీఆర్ వెంట మోత్కుపల్లి అసెంబ్లీకి రావ‌డం పెద్ద సంచ‌ల‌న‌మే రేపింది.ఇక కేసీఆర్ ఆయ‌న్ను త‌న వెంట‌నే ఉంచుకుని సీఎం కార్యాలయంలోనే చాలాసేపు ఇద్ద‌రు గ‌డిపారు.ఇక అసెంబ్లీ హాలులోనే ఇద్ద‌రూ క‌లిసి భోజ‌నం కూడా చేశారు.

సాయంత్ర త‌ర్వాత మోత్కుప‌ల్లిని సీఎం త‌న వెంట ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు.అక్క‌డే రెండు గంట‌ల‌కు పైగా చ‌ర్చించిన త‌ర్వాత లైన్ క్లియ‌ర్ చేసేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మ‌రో నాలుగు రోజుల్లో మోత్కుపల్లి టీఆర్ఎస్ గూటికి వ‌చ్చేస్తార‌ని తెలుస్తోంది.ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి కూడా ఆఫ‌ర్ చేశార‌నే ప్ర‌చారం సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు