బ్రేకింగ్.. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ని అడ్డుకున్న నిరుద్యోగులు

ఉద్యోగాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీగా ఉద్యోగాలు కల్పించలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్.చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో నిర్వహించిన జాబ్ ఫెయిర్ లో నిరుద్యోగుల ఆందోళన.

 Breaking Unemployed Who Blocked Mlc Surabhi Vani Devi, Unemployed ,blocked Mlc S-TeluguStop.com

పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు.సెంట్రల్ లైబ్రరీ వారి సౌజన్యంతో ముందుకొచ్చిన 50 ప్రైవేట్ కంపెనీలు.

ప్రారంభానికి విచ్చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ సురభి వాణి దేవి. నిధులు, నీళ్లు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మహత్యలు తప్ప ఉద్యోగాలు లేవని ప్రశ్నించిన నిరుద్యోగులు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతే తే తెలంగాణ ఎవరికోసం, ఎందుకోసం ఏర్పడిందో చెప్పాలి.ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50 వేల ఉద్యోగాలు ప్రకటించిన కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న నిరుద్యోగులు.

ముఖ్యమంత్రి తో మాట్లాడుతానన్న ఎమ్మెల్సీ వాణి దేవి. ఉద్యోగాలపై ముఖ్యమంత్రితో మాట్లాడకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నిరుద్యోగులు.శాసనమండలిలో నిరుద్యోగుల తరఫున మాట్లాడతానని వెళ్ళిపోయినా సురభి వాణి దేవి.నిరుద్యోగుల ఆందోళన మధ్య నుండి ఎమ్మెల్సీని తీసుకెళ్ళి తన వాహనంలో పంపించిన పోలీసులు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగులపై ప్రకటన చేయకుంటే జిల్లాలు మండలాలు రాష్ట్రస్థాయిలో నిరుద్యోగుల ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube