వైరల్ వీడియో: కీర్తనలు పాడుతూ లైవ్‌లోనే ప్రాణాలు విడిచిన బాబా..!

మహారాష్ట్ర, జాల్నా జిల్లా, బోధ్లాపూర్‌కు చెందిన ప్రముఖ కీర్తంకర్‌ తాజుద్దీన్‌ మహారాజ్ షేక్ బాబా హఠాన్మరణం చెందారు.

వందల మంది భక్తుల సమక్షంలో కీర్తనలు పాడుతూనే ఉన్నట్టుండి ఆయన ప్రాణాలు వదిలారు.

ఈ ఘటన సక్రి తాలూకాలోని నిజాంపూర్‌ సమీపంలోని జామ్డేలో అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది.సోమవారం సెప్టెంబర్ 27న శ్రీ గ్రంథరాజ్ జ్ఞానేశ్వరి పారాయణ్ సప్తహ్ సందర్భంగా ఆయన కీర్తన ఆలపించడం ప్రారంభించారు.

ఈ కార్యక్రమం స్టేజీపై కీర్తనలు పాడుతున్న సమయంలోనే తాజుద్దీన్ కి గుండెపోటు వచ్చింది.దాంతో అతను అకస్మాత్తుగా కింద కూర్చుండి పోయారు.

అప్పటికీ అక్కడ ఉన్న వారెవరూ బాబాకి గుండె పోటొచ్చిందనే విషయాన్ని గ్రహించలేకపోయారు.ఈలోగా బాబా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Advertisement

దాంతో షాక్ అయిన సదరు భక్తులు బాబాని లేపేందుకు ప్రయత్నించారు.కానీ ఫలితం లేకపోవడంతో హుటాహుటిన అతన్ని చికిత్స నిమిత్తం నందూర్‌బార్‌కు తరలించారు.

అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు విడిచారు.దీంతో భక్తులు తీవ్ర విషాదం నెలకొంది.

కాగా తాజుద్దీన్‌ మృతదేహానికి పర్భని జిల్లాలోని గంగాఖేడ్ తాలూకాలోని స్వగ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.కాగా బాబా కీర్తనలు పాడుతూ చనిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

దీనిపై చాలా మంది నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కీర్తంకర్ తాజుద్దీన్ బాబా ముస్లిం కుటుంబంలో జన్మించారు.అయితే చిన్నతనం నుంచే ఆయన వార్కారీ జీవనశైలిని పాటించారు.ప్రతిరోజు క్రమం తప్పకుండా హరిపత్, భజన కార్యక్రమాలలో పాల్గొనేవారు.

Advertisement

హిందూ, ముస్లిం మతాల మధ్య విభేదాలను తొలగించడంలో ఆయన చాలా కృషి చేశారు.కులమతాలతో సంబంధం లేకుండా అందరూ సమానమే అనే భావనతో ఆయన మెలిగేవారు.

అందరం ఒకటేనని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన తన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు.

తాజా వార్తలు