షర్మిలమ్మ కోసం విజయమ్మ త్యాగం ? 

ఇప్పుడు ఏపీ తెలంగాణలో వైయస్ విజయమ్మ వ్యవహారశైలి పైన చర్చ జరుగుతోంది.దివంగత రాజశేఖర్ రెడ్డి భార్యగా ఆమె రేపు వైస్ అభిమానులతో సమావేశం నిర్వహించబోతున్నారు.

రాజకీయాల్లో ఉన్నా.ఎప్పుడు పెద్దగా రాజకీయాల వైపు దృష్టి సారించని విజయమ్మ 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.

అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.అయితే అన్ని వ్యవహారాలను విజయమ్మ తరఫున జగన్ చక్కబెట్టే వారు.

ఇక కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేస్తూ, అనేకసార్లు యాత్రలు నిర్వహించారు.వైస్ సెంటిమెంట్ ను ఉపయోగిస్తూ కుమారుడు పార్టీకి మేలు జరిగే విధంగా ఆమె వ్యవహారాలు చేశారు.

Advertisement

ఇక అంతా అనుకున్నట్లుగానే జగన్ ఏపీకి సీఎం అయ్యారు.దీంతో ఒక సీఎంకు భార్యగా మంచి హోదాను అనుభవించిన విజయమ్మ కుమారుడు సీఎంగా మారడంతో అన్ని రకాల గానూ సంతృప్తి చెందారు.

అయితే అనూహ్యంగా కుమార్తె వైఎస్ షర్మిల కూడా కొత్త పార్టీని తన భర్త రాజశేఖర రెడ్డి పేరుతో స్థాపించి తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండటం, అనుకున్న స్థాయిలో పార్టీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకోలేక పోవడం తదితర కారణాలతో నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగారు.షర్మిల పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక పూర్తిగా షర్మిల పార్టీ తరఫున పోరాడేందుకు ఆమె రకరకాల మార్గంలో ప్రయత్నం చేస్తున్నారు.షర్మిల సైతం ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అంతేకాదు టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అయినా ఆశించిన స్థాయిలో ఆదరణ జనాల నుంచి లేకపోవడం, కొత్తగా ఎవరు ఈ పార్టీ వైపు వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడం,  తదితర కారణాలతో విజయమ్మ నేరుగా రంగంలోకి దిగి షర్మిల తరపున పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలో వైస్ చరిష్మా ఇప్పటికీ పనిచేస్తుందని, దానిని జాగ్రత్తగా షర్మిల వైపు మళ్లిస్తే ఆమె రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి డోఖా ఉండదనే నమ్మకం తోనే ఆమె రేపు ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ సందర్భంగా వివిధ పార్టీల్లో ఉన్న వైఎస్సార్ అభిమానులు ప్రత్యక్షంగా, కుదరకపోతే పరోక్షంగా అయినా షర్మిల కు మద్దతు ప్రకటించాలనే విధంగా ఆమె ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

Advertisement

ఇదే సమయంలో కొడుకు కంటే కూతురు కి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు అన్నట్లుగా వ్యవహారం కానిపిస్తోంది.

తాజా వార్తలు