వాయిదా వేసినందుకు ఫీల్ అవుతున్న గల్లీ రౌడీ!

కరోనా కారణంగా చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.సినిమాలు పూర్తి చేసుకుని ఉన్నా విడుదల చేయలేని పరిస్థితి.

అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టిన కారణంగా థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో అన్ని సినిమాలు వరుసగా విడుదల అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.అయితే ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్స్ కోసం అన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి.

వారానికి నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసేందుకు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో గట్టి పోటీ ఉంటుంది.

కొన్ని సినిమాలు పోటీ ఎక్కువుగా ఉండడం వల్ల విడుదల వాయిదా వేసుకుంటున్నారు.అలాగే సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా కూడా వాయిదా పడింది.

Advertisement

ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.అయితే అదే రోజు గోపీచంద్ సీటిమార్ సినిమా కూడా రాబోతుందని ప్రకటించడంతో సందీప్ కిషన్ సినిమా వాయిదా వేసుకున్నారు.

సెప్టెంబర్ 3న అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.ఈ నేపథ్యంలో గల్లీ రౌడీ మేకర్స్ పోటీ ఎక్కువుగా ఉన్నప్పుడు తమ సినిమాను విడుదల చేసి రిస్క్ చేయడం ఎందుకని ఈ సినిమాను వాయిదా వేశారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది.గల్లీ రౌడీ మేకర్స్ వాయిదా వేసిన తర్వాత గోపీచంద్ సీటిమార్ సినిమాను కూడా వాయిదా వేసింది.

ఎందుకంటే సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రావాల్సి ఉండగా ఆ సినిమా వాయిదా పడింది.దీంతో సీటిమార్ సినిమా వినాయక చవితి రేస్ లోకి వచ్చింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

లవ్ స్టోరీ ప్లేస్ లో సీటిమార్ సినిమా రాబోతుంది.దీంతో ఇప్పుడు గల్లీ రౌడీ మేకర్స్ తమ సినిమాను అనవసరంగా వాయిదా వేశామని బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఇంకా విడుదలకు ఐదారు రోజుల సమయం ఉండడం వల్ల గల్లీ రౌడీ మేకర్స్ ఏమైనా అభిప్రాయం మార్చుకుంటారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు