ఇది విన్నారా.. ఆఫీస్ కోసం టాయిలెట్ అద్దెకిస్తారంట‌..

మ‌నం ఎక్క‌డైనా స‌రే ఇండ్ల‌ను అద్దెకి్వ‌వ‌డాన్ని చూస్తున్నాం.లేదంటే హోట‌ల్ లో రూమ్‌ల‌ను లేదంటే లాడ్జీల‌ను మాత్ర‌మే అద్దెకివ్డాన్ని చూస్తున్నాం.

కానీ ఇప్పుడు ఓ వ్య‌క్తి ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని దాన్ని అద్దెకివ్వ‌డానికి రెడీ అయిపోయాడు.అయితే అది త‌న ఇంట్లో ఖాళీగా పడుందని అనుకున్నాడో లేక ఏదైనా కొత్త‌గా ట్రై చేయ‌డానికి రెడీ అయ్యాడో తెలీదు గాని ఇప్పుడు ఆయ‌న ఏకంగా టాయిలెట్‌నే అద్దెకు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

అయితే తాను టాయిలెట్‌ను అద్దెకిచ్చేది కూడా కేవ‌లం ఆఫీసు కోసం మాత్ర‌మేనంట‌.స్కాట్‌లాండ్ లోని గ్లాస్గోలోని పాట్రిక్ ప్రాంతంలో నివ‌సిస్తున్న ఓ వ్యక్తి గమ్‌ట్రీ సైట్ చేసిన ప్రకటననే ఇప్పుడు పెద్ద వైర‌ల్ గా మారిపోయింది.

అదేంటంటే తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ లోప‌ల మొద‌టి ఫ్లోర్‌లో ఖాళీగానే ప‌డి ఉంటున్న టాయిలెట్‌ను అద్దెకు ఇస్తున‌ని, అందుకు తాను రెడీగా ఉన్నానంటూ ప్ర‌క‌ట‌న జారీ చేశాడు.అయ‌తే ఆ టాయిలెట్ లో అన్ని ర‌కాల స‌దుపాయాలు అన‌గా వైఫై, రిఫ్రిజిరేటర్‌, టీ కెటిల్ లాంటివి ఉన్నాయ‌ని తెలిపాడు.

Advertisement

ఆ టాయిలెట్ ను ఓ వ్య‌క్తి చిన్న ఆఫీసును నిర్వ‌హించుకునేందుకు వీలుంటంద‌ని చెప్పాడు.

కాగా టాయిలెట్‌ను ఇలా ఆఫీస్ లాగా మార్చుకుంటే బాగుంటుంద‌ని, కాగా దాన్ని వాడుకోవటానికి త‌న‌కు వారానికి ఒక‌సారి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌లు అంటే మ‌న క‌రెన్సీలో రూ.5,070 చెల్లిస్తే స‌రిపోతుంద‌ని తెలిపాడు.ఇక తాను మాత్రం ఇందుకోసం సోమవారం అలాగే శుక్రవారం రెండు రోజుల పాటు అందుబాటులో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తానంటూ తెలిపారు.

అయితే ఈ టాయిలెట్ ను ఎక్కువ కాలం అద్దెకు తీసుకుంటే వారికి దాని కీ కూడా ఇస్తానంటూ ప్ర‌క‌టించాడు.ఇక ఆయ‌న ప్రకటనను చూసిన వారంతా కూడా సీరియస్ అవ్వ‌డంతో వెంట‌నే డిలీట్ చేసుకున్నాడు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు