అసలే ఇది వర్షాకాలం.అడుగు బయట పెడితే చాలు మొత్తం తడిచిపోయి గాని ఇంటికి రాలేని పరిస్థితి.అయితే మనం తడిచిన పర్వాలేదు గాని.మన ఫోన్ మాత్రం వర్షానికి తడవకూడదు అని ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాము.ఎన్ని జాగ్రత్తలు పాటించిన గాని ఒక్కోసారి ఫోన్ తడిసిపోతూ ఉంటుంది.అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫోన్ నీళ్లలో పడిపోవడం లాంటివి కూడా జరుగుతాయి.
అలాంటప్పుడు ఫోన్ చెడిపోయే ప్రమాదం ఉంది.ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి ఫోన్లోకి నీళ్లు వెళితే చెడిపోయే ప్రమాదం ఉంది.
మరి అలాంటప్పుడు మీ ఫోన్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అనుకోకుండా ఫోన్ నీటిలో పడి తడిచిపోతే మొట్టమొదటగా మీరు చేయవలసిందల్లా ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం.
అలా ఫోను స్విచ్ ఆఫ్ చేయకుండా పనిచేస్తుందో లేదో అని ఏవన్నా బటన్స్ నొక్కినట్లయితే గనుక షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది.అందుకే ఫోను నీటిలో తడిచి పోయినప్పుడు ముందుగా ఏ బటన్స్ ప్రెస్ చేయకుండా ఫోను స్విచ్ ఆఫ్ చేయాలి.

అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తడిగా ఉన్న ఫోన్ కి ఛార్జింగ్ పెట్టకూడదు.ఇలా ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.మీరు ఫోనుని స్విచ్ మీరు ఫోనుని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫోనులో ఉండే బ్యాటరీ, సిమ్ కార్డు, మెమరీ కార్డు అన్నిటిని వేరు చేసేసి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టి మెత్తటి టవల్ తో అన్నితిని తుడవండి.ఒకవేళ మీ ఫోన్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ కలిగినట్లయితే బలవంతగా బ్యాటరీ తీసే ప్రయత్నం చెయకండి.
ఫోన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.ఫోన్లోకి నీరు వెళ్ళినట్లైయితే వెంటనే ఫోన్ ఆఫ్ చేసి పొడి బియ్యంలో ఫోన్ ఉంచండి.
ఇలా చేయడం వలన ఫోన్లో ఉన్న తేమను పొడి బియ్యం త్వరగా పీల్చుకుంటాయి.ఫలితంగా ఫోన్ లోపలి భాగాలు ఆరిపోతాయి.
అంతేకాకుండా సిలికా జెల్ ప్యాక్ లలో కూడా ఫోన్ ఉంచవచ్చు.సిలికా జెల్ కి కూడా తేమను పిల్చుకునే లక్షణం ఉంది.

ఇలా మీ ఫోన్ లో ఉన్న తేమ అంతా పోవాలంటే కనీసం 24 గంటలు పాటు బియ్యంలో ఉంచాలి.పూర్తిగా ఆరిపోయిన తరువాత మాత్రమే ఫోన్ ఆన్ చేయాలి.అన్ని భాగాలు ఆరిపోయిన తరువాత ఫోన్ ఆన్ చేసి చూడండి.ఒకవేళ ఎంత సేపటికి ఫోన్ ఆన్ అవ్వకపోతే సర్వీస్ సెంటర్ కి తీసుకుని వెళ్ళండి.అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే.ఫోన్ తడిచి పోయిందని గాని డ్రైయర్ తో ఫోన్ ను ఆరబెట్టకండి.
ఈ డ్రైయర్ నుంచి వచ్చే వెచ్చని గాలి షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కారణం కావచ్చు.అలాగే
ఫోన్ పూర్తిగా ఆరిన తరువాతనే హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం గాని ఛార్జింగ్ పెట్టడం గాని చేయాలి.
అలా కాకుండా తడిచిన వెంటనే ఛార్జింగ్ పెడితే ఫోన్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.