క‌రోనా సెకండ్ వేవ్‌లో ఇండియాకు సాయం చేసిన దేశాలు ఏవో మీకు తెలుసా..?

క‌రోనా ప్ర‌పంచాన్ని కుదిపేసంద‌నే చెప్పాలి.అది ఎఫెక్ట్ చూపించ‌ని దేశ‌మే లేదు కాబోలు.

ఎందుకంటే ప్ర‌తి దేశాన్ని అది తాకింది.ప్రతి ప్రాంతాన్ని ఇబ్బందుల్లో నెట్టేసింది.

దీంతో సామాన్య జనం దాని ధాటికి విల‌విల లాడిపోయారు.ఇక చిన్న చిన్న దేశాలు, పేద దేశాలు అయితే ఎంత‌గా ఇబ్బందులు ఎదుర్కున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక మ‌న దేశంలో కూడా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న‌ది.మ‌రి సెకండ్ వేవ్ వ‌చ్చిన‌ప్పుడు మ‌న దేశానికి అండ‌గా చాలా దేశాలు నిలిచాయి.

Advertisement

ఎందుకంటే సెకండ్ వేవ్‌లో మ‌న దేశంలోనే అత్య‌ధిక కేసులు పెరిగాయి.దీంతో ఆక్సిజ‌న్ అంద‌క ఇత‌ర మెడిక‌ల్ అవ‌స‌రాలు స‌రిపోక ఎన్నో ఇబ్బందుల‌ను ఎద‌ర్కొంది ఇండియా.

అలాంటి టైమ్ లో మ‌న దేశానికి చాలా దేశాలు సాయం చేశాయి.మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్త‌వానికి సెకండ్ వేవ్లో కొవిడ్ రోగులకు అవసరమయ్యే మెడిక‌ల్ మందుల ద‌గ్గ‌రి నుంచి ఎన్నో వైద్య ప‌ర‌మైన పరికరాలతో పాటు తదితరాలు మ‌న‌కు సాయం చేసి గొప్ప మనస్సును చాటుకున్న దేశాల‌ను మ‌నం ఎప్ప‌టికీ మ‌ర్చిపోకూడ‌దు.అయితే మ‌న దేశంలో సెకండ్ వేవ్ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 52 దేశాల నుంచి సాయం అందింద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

ఆ 52 దేశాలు ఎన్నో ర‌కాలుగా మెడిక‌ల్ మందుల‌తో పాటు ఇత‌ర మెడిక‌ల్ పరికరాలను ఇండియాకు పంపించి సాయం చేశాయ‌ని నిన్న అన‌గా గురువారం కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ప్ర‌క‌టించ‌డంతో ఈ విధ‌మైన అనేక ప్రశ్నల‌కు స‌మాధానం దొర‌కింద‌న్న‌మాట‌.క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో మ‌న దేశానికి చాలా దేశాలు వ్యాక్సిన్ల‌ను కూడా అందించాయ‌ని, ఇత‌ర ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను కూడా పంపించాయ‌ని ఆయ‌న వివ‌రించారు.అనేక ర‌కాలుగా వ‌చ్చిన ఈ సాయాన్ని స‌ద్వినియోగం చేసుకున్న‌ట్టు వివ‌రించారు ఆయ‌న‌.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు