ఏపీ సీఎం పై సీరియస్ కామెంట్ చేసిన రఘురామకృష్ణంరాజు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసిపి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొంత కాలం నుండి లెటర్లు రాస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకపక్క విమర్శలు చేస్తూనే మరో పక్క నవ సూచనలు పేరిట ప్రభుత్వానికి సలహాలు కూడా రఘురామకృష్ణంరాజు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ పై ఎటకారంగా విమర్శలు చేశారు.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతుంది అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్ రూపాయి జీతం తీసుకున్న.హెలికాప్టర్ ఖర్చు కూడా తగ్గించుకుంటే బాగుంటుంది అని సూచించారు.అంత మాత్రమే కాక తాడేపల్లి ప్యాలెస్ లో ఉండిపోవటం కాక జనాల మధ్య లోకి రావాలని పేర్కొన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి.అవి ఇంకా పూర్తి కాకుండా.సరిగ్గా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా.

Advertisement

ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రజలకు ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.

ఇదే రీతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇటీవల తెలుగు భాషలో విచారణ జరపటం పట్ల రఘురామకృష్ణంరాజు సంతోషం వ్యక్తం చేశారు.మాతృభాషపై ఉండే మమకారం పరాయి భాషలో ఉండదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు