జైల్లో ఉన్నప్పుడు నా డబ్బంతా దొబ్బెశారు.. ఫన్ బకెట్ భార్గవ్ కన్నీటిగాధ?

సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ సమయంలో మంచి సెలబ్రిటీ హోదాను అందుకున్న ఫన్ బకెట్ భార్గవ్ అంతే త్వరగా తన కెరీర్ ను నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే.

గతంలో ఇతడు ఓ మైనర్ బాలికను లొంగదీసుకొని ఆమెను గర్భవతిని చేసిన విషయం బయటపడటంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

ఇక ఇప్పటికే ఇతనిపై కేసు విచారణలో ఉండగా తాజాగా బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్.

యూట్యూబ్ లో ఫన్ బకెట్ పేరుతో కొంతమంది అమ్మాయిలతో కలిసి వీడియోలు కూడా చేశాడు.అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

కానీ టిక్ టాక్ లో పరిచయమైన 14 ఏళ్ల బాలికకు తనకు ఆఫర్లు ఇస్తానని మరింత పేరు అందిస్తానని చెప్పి నమ్మించాడు.ఆమెను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు.

Advertisement

కానీ ఆ అమ్మాయి నో అనడంతో చెల్లి అని పిలిచేవాడు భార్గవ్.

అలా తను బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసి ఈ వీడియోలను బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.అంతేకాకుండా పలుమార్లు తనను శారీరకంగా వేధించి గర్భవతిని చేశాడు.దీంతో ఈ విషయం బయటపడటంతో అతడిపై దిశ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది.

అలా కొన్ని రోజులు జైల్లో ఉన్న అతడు ఇటీవల బయటకు రాగా మళ్లీ పోస్ట్ చేశాడు.దీంతో అతడిపై నెటిజనులు మరింత దారుణంగా ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు.అందులో ఇది నా కథ అంటూ కొన్ని విషయాలు మాట్లాడాడు.అందులో కాస్త ఎమోషనల్ గా కనిపించాడు భార్గవ్.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక తనపై వచ్చిన ఆరోపణల గురించి క్లారిటీ ఇవ్వాలన్న కూడా ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉందని ఏమి మాట్లాడలేకపోతున్నానని తెలిపాడు.ఇక తను నెలకి రూ.8 లక్షలు సంపాదించిన కూడా డబ్బులు దాచుకోలేకపోయాడట.

Advertisement

తన స్నేహితులు తనని మోసం చేశారని.తాను దాచుకున్న 12 లక్షలు తన అకౌంట్ నుండి డ్రా చేశారని తెలిపాడు.తాను జైల్లో ఉన్నప్పుడు తన డబ్బంతా దొబ్బేశారని.

తను బయటకి వచ్చేసరికి తన జాబ్స్ అన్ని పోయాయని ఎమోషనల్ అయ్యాడు.ఇక తను కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానని.

ఈ ప్రయాణంలో తనను అందరూ ప్రోత్సహించాలని కోరాడు.ఈ కంటెంట్ నచ్చకపోతే చెప్పండి కానీ నెగటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దని కోరాడు.

కానీ నెటిజన్లు మాత్రం అతడిపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.ప్రస్తుతం అతడు షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తాజా వార్తలు