తెలంగాణాలో మూడు రోజులు భారీ వర్షాలు..!

తెలంగాణాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేటి నుండి మూడు రోజుల పాటు తెలంగాణాలో భారీ వర్ష సూచన ఉంది.

నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.రేపు, ఎల్లుండి మాత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో ఈ భారీ వర్షాలు పడతాయని తెలుస్తుంది.నేడు కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటుగా మంచిర్యాల, కరీం నగర్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించారు.

అంతేకాదు కరీంనగర్, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ములుగు, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల లో రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది.నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, జనగామ, సిద్ధిపేట, కరీం నగర్, కామారెడ్డి జిల్లాల్లో రేపు, ఎల్లుండి మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.వాతావరణ సూచన ప్రకారం దాదాపు ఈ మూడు రోజులు తెలంగాణాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

దూర ప్రాంతా ప్రయాణాలు వెళ్లే వారు వర్ష సూచనలను గమనించాలని వాతావరణ శాఖ చెబుతుంది.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు