కొన్ని కొన్ని సార్లు పెళ్లికి హాజరయ్యే వారే కాకుండా పెళ్లి చేసుకునే వారు కూడా ప్రవర్తించే తీరు కూడా నవ్వు తెప్పిస్తుంటుంది.వారు చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి.
కొందరికి చికాకుని కూడా కలిగిస్తాయి.చాలా మంది తమ పెళ్లి కోసం అనేక కలలు కంటుంటారు.
ఎంత ఖర్చయినా పర్వాలేదు పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలని కోరుకుంటారు.ఇలా కోరుకుని చేసే వింత చేష్టలతో నవ్వులపాలవడమే కాకుండా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు.
అంతే కాకుండా శృతి మించుతూ… సంప్రదాయాలను మంటగలిపేలా పలువురు ప్రీ వెడ్డింగ్ షూట్లను కూడా చేయించుకుంటున్నారు.ఇలా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఫొటో షూట్లపై నెటిజన్లు తీవ్రంగా ఫైరవుతుంటారు.
తన పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని భావించిన ఓ యువతి నవ్వుల పాలయిన ఘటన మహారాష్ర్టలో చోటు చేసుకుంది.అసలు ఆ యువతి ఏం చేసిందంటే….
మహారాష్ర్టలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన శుభాంగి అనే యువతి పెళ్లిలో చేసిన హంగామా చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.ఎవరైనా కార్లో పెళ్లి మండపానికి చేరుకోవడం మనం సహజంగా చూస్తుంటాం.
కాని శుభాంగి కొత్తగా ఆలోచించి… కారు బానెట్ పై కూర్చుని తన పెళ్లి మండపానికి చేరుకుంది. అంతే కాకుండా ఈ సమయంలో ఫొటోలకు కూడా ఫోజులిచ్చింది.
ప్రమాదకరంగా కారు బానెట్ పై పయనిస్తూ… పెళ్లి మండపానికి చేరుకుంది.
ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు.ఇంతలా వధువు హద్దు మీరి ప్రవర్తించినా… ప్రమాదకరంగా ప్రయాణించినా. ఆ వధువు ఇంటివారు కానీ బంధువులు కానీ వద్దని చెప్పకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.ఇలా నిబంధనలు మరిచి బానెట్ పై కూర్చున్న వధువు శోభాంగిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.