తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో గతంలో ప్రసారమయ్యే “లవ్” అనే ధారావాహిక ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీరియల్ హీరోయిన్ “రేష్మా పసుపులేటి” గురించి సినీ ప్రేక్షకులకు దాదాపుగా సుపరిచితమే.అయితే ఈ సీరియల్ లో నటించిన తర్వాత రేష్మా పసుపులేటి కి తన మాతృ భాషలో వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్ బుల్లితెరకు దూరమైంది.
ఆ తరువాత దాదాపు 10 కి పైగా సీరియల్లో మరియు 6 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉండటం అంటే ఈ పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది.
కాగా ఈ మధ్య కాలంలో రేష్మా పసుపులేటి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్లలో దిగిన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది.కాగా తాజాగా ఈ అమ్మడు యోగా చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను వీడియోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీంతో ఈ అమ్మడికి రోజు రోజుకి ఫ్యాన్ బాగానే పెరుగుతోంది.అంతేకాకుండా ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు కూడా బాగానే వరిస్తున్నట్లు సమాచారం.దీంతో రేష్మా పసుపులేటి కి 33 ఏళ్లు వచ్చినప్పటికీ తన వన్నె తరగని అందంతో అలాగే అందాల ఆరబోతతో మతిపోగొడుతున్నదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 8 లక్షల 50 వేల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అని.