తెలుగు చలనచిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకులలో ఒకడిగా నిలిచాడు.
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రతి ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రాజమౌళికి మంచి పేరు ఉంది.
బాహుబలి సినిమాకు దర్శకత్వం వహించి మంచి క్రేజ్ అందుకున్నాడు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన బాహుబలి సినిమాను అన్ని భాషలలో రీమేక్ చేయించి మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక అదే తరహాలో ఎన్నో సినిమాలను చేస్తున్నాడు రాజమౌళి.ఇదిలా ఉంటే ఈయన సినిమాల కోసం ఎంతో మంది స్టార్ నటులు ఎదురుచూస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే చాలు అనుకునే నటులు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే ఓ దర్శకుడు పొట్టోడా అని పిలిచేవాడట.
తాజాగా రాజమౌళి కొన్ని విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు.ఇక ఈయన దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర కంటే ముందు తన తండ్రి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పని చేశాడట.
ఆ తర్వాత దర్శకుడు క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడట.ఇక ఏళ్ల క్రిందట హీరో నాగ శౌర్య, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ నటించిన దిక్కులు చూడకు రామయ్య సినిమా తెరకేక్కగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేదు.
ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ త్రికోటి.

ఇక త్రికోటి రాజమౌళికి సీనియర్ అట.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్న రాజమౌళి తనకు త్రికోటికి మధ్యనున్న అనుబంధం గురించి చెప్పాడు.తమిళ్ క్రాంతి కుమార్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరు కలిసి సినిమాలకు తిరిగేవారట.
అలా సినిమాలు చూసి ఇంటికి వచ్చేటప్పుడు జారిపోతున్న పాంట్ ను పైకి లాక్కుంటూ తనను ఏ పొట్టోడా అంటూ పిలిచేవాడట త్రికోటి.కానీ ఇద్దరూ ఒకే హైట్ ఉన్నా కూడా అలా పిలవడానికి అర్థం చిన్నోడా అని తెలిపాడు.
ఇక రాజమౌళి దర్శకుడిగా మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ గా త్రికోటిను జాయిన్ అవమని కోరాడట.ఇక రాజమౌళి నమ్మకంతో త్రికోటి జాయిన్ అయ్యాడట.అలా జాయిన్ అయిన కొత్తలో తనను మౌళి అని పిలిచేవాడట.ఆ తర్వాత కొంతకాలం సార్ అని పిలిచేవారట.
ఎవరు లేని సమయంలో మౌళి అని పిలిచేవాడట.







