ఎమ్మార్వో డ్యూటీ ఎక్కిన రవితేజ.. నిజమేనా అంటోన్న ఫ్యాన్స్!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న మాస్ రాజా, తాజాగా ఖిలాడి అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

 Raviteja As Mro In 68th Movie, Raviteja, Rt68, Nakkina Trinadha Rao, Tollywood N-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.

దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో రవితేజ తన 68వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్, రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఇటీవల ప్రారంభించారు.

ఇక ఈ సినిమా అప్‌డేట్‌కు సంబంధించిన పోస్టర్ చిత్ర వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.ఈ పోస్టర్‌లో ప్రభుత్వ ఆఫీసులో రవితేజ కూర్చున్న తీరును చూస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఏమిటా అని అందరూ అనుకున్నారు.

కాగా ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో రవితేజ తన నిజాయితీతో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాడు, వాటిని రవితేజ ఎలా అధిగమిస్తాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ దివ్యాన్షా కౌషిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి అంతే త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఎమ్మార్వో పాత్రలో రవితేజ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube