ఏ పార్టీకి అయినా కొత్తగా అధ్యక్షుడు వస్తే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తారు.ఆయన్ను కలిసేందుకు ప్రత్యేక సమయం కేటాయించి మరీ వెళ్తుంటారు.
ఇదే కోవలో బీజేపీకి బండి సంజయ్‌ను నియమించినప్పుడు కూడా పార్టీలోని అందరు నేతలు కలిసి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కలిసకట్టుగా పోరాడుతామని చెప్పారు.
ఇక ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఎంత బలంగా దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం.
కానీ రేవంత్ విషయంలో మాత్రం అంతా రివర్స్‌లో జరుగుతుంది.
ఆయన్ను ప్రెసిడెంట్ చేయగానే చాలామంది విమర్శిస్తున్నారు.ఇంకొందరైతే ఏకంగా రాజీనామాల దగ్గరి దాకా వెళ్లారు.
ఇక కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి లాంటి వారైతే ఆయన్ను కలిసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.వారే ఏకంగా రేవంత్‌ను కలవొద్దని చెబుతున్నారు.
తమను కలిసేందుకు ప్రయత్నించవద్దని చెప్పడం సంచలనం రేపుతోంది.

కానీ ఇది ఇంకెంత కాలం ఇలా ఉంటారు.ఎందుకంటే ముందు ముందు హుజూరాబాద్ ఉప ఎన్నిక రాబోతోంది.అందులో గెలిచేందుకు ఇప్పటికే టీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు పన్నుతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా కుమ్ములాటే చేసుకుంటే ఎలా అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి సీనియర్లు ఇంకెంత కాలం రేవంత్‌ను ఇలా పక్కన పెడుతారన్నదే ఇప్పుడు వస్తున్న పెద్ద ప్రశ్న.అయితే రేవంత్ మాత్రం అందరినీ కలుపుకుని పోతానని చెబుతున్నా సీనియర్లు మాత్రం కలవొద్దని చెప్పడం ఆయనకు ఇబ్బందిగా మారుతుంది.
రేవంత్ ఇప్పటికే చాలామంది ఇండ్లకు వెళ్లి మరీ కలుస్తున్నా మిగతా వారు ఫోన్ చేస్తే రావొద్దని చెబుతున్నారంట.మరి వారంతా పార్టీలోనే ఉంటారా లేదా వేరే పార్టీలోకి వెళ్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.
ఏదేమైనా రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచే పెద్ద సవాళ్లు ఎదురవుతున్నా.ఆయన మాత్రం ఎలా ముందుకు వెళ్తారనేది వేచిచూడాలి.