గూగుల్‌ మెసేజింగ్‌ కొత్త ఫీచర్‌!

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తమ వినియోగదారులకు ఆకట్టుకునే గూగుల్‌ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది.

ఈ గూగుల్‌ మెసేజెస్‌తో పర్సనల్, ప్రమోషనల్‌ యాప్స్‌ను వేరు చేసుకునే వెసులుబాటుకు అవకాశం కల్పించింది.ఈ ఫీచర్‌తో ట్రాన్సాక్షన్‌ ధ్రువీకరణకు వచ్చే ఓటీపీ మెసేజ్‌లను ఇకపై ఆటోమెటిగ్గా 24 గంటల్లో డిలీట్‌ చేసుకోవచ్చు.

మామూలుగా మన అందరి ఫోన్లలో ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో మెసేజ్‌లు వస్తూ ఉంటాయి.అన్ని రకాల సందేశాలతో మన ఇన్‌బాక్స్‌ నిండిపోతుంది.

మనకు అక్కరకు లేని మెసేజ్‌లను డిలీట్‌ చేయటానికి సమయం తీసుకుంటుంది.దీంతో మనం పనిగట్టుకుని డిలీట్‌ చేయడానికి సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

ఒక్కోసారి ఆ సంగతి మరచిపోతాం.ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న టెక్‌ దిగ్గజం కొత్తగా రెండు ఫీచర్లను తీసుకొచ్చింది.

ఫీచర్ల పనితీరు.

ఈ కొత్త ఫీచర్‌తో ముఖ్యమైన మెసేజెస్‌ను గుర్తించి, అవసరం లేని వాటిని డిలీట్‌ చేస్తుంది.అంతేకాక, పర్సనల్‌, ప్రమోషనల్‌ మెసేజెస్‌ను వేర్వేరు కేటగిరీలుగా విభజిస్తుంది.ఈ ప్రక్రియ మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీతో పూర్తి చేస్తుంది.

సాధారణంగా మనకు వచ్చే వన్‌ టైం పాస్‌వర్డ్‌లు కేవలం ఒక్కసారికే పనిచేస్తాయి.ఆ తర్వాత వాటితో మనకు ఎటువంటి అవసరం ఉండదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వీటిని 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్‌ చేసేందుకు గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.దీనివల్ల స్టోరేజీ కూడా ఫ్రీ అయిపోతుంది.

Advertisement

ఓటీపీ మెసేజెస్‌ను ఆటోడిలీట్‌ చేయడానికి గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌లో ఓటీపీ కేటగిరీ కింద కనిపించే ‘కంటిన్యూ’ ఆప్షన్‌ నొక్కాలి.

తద్వారా ఈ కొత్త ఫీచర్‌ మీ ఫోన్‌లో అందుబాటులోకి వస్తుంది.ఆండ్రాయిడ్‌ 8, ఫోన్లలో ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంటుందని గూగుల్‌ స్పష్టం చేసింది.ఈ ఫీచర్‌ను కావాలంటే ఆప్షనల్‌ మార్చుకోవచ్చు.

ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే మీ గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.యాపిల్‌ ఐమెసేజ్‌, వాట్సాప్, టెలిగ్రామ్‌ వంటి ఇతర థర్డ్‌ పార్టీ మెసేజ్‌ యాప్స్‌తో పోటీ పడేందుకు తన ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది గూగుల్‌.

తాజా వార్తలు