బాడీలో కరిగిపోయే కొత్త పరికరం.. గుండె సమస్యలకు చెక్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు గుండె నాళాల వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి.ఈ వ్యాధితో మన దేశంలో ఏటా 24.

8 శాతం మరణాలు సంభవిస్తున్నాయి.ఈ మరణాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైర్‌లెస్‌ పేస్‌ మేకర్‌ పరికరాన్ని తయారు చేశారు.

దీని ప్రత్యేకత బాడీలో కరిగిపోవడం.దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెట్టేందుకే రూపొందించారు.

ఇప్పటికీ అందుబాటులో ఉన్న పరికరాలు ఉన్నా.అవి సైడ్‌ఎఫెక్ట్స్‌కు దారి తీసేవని సైంటిస్టులు చెప్పారు.

Advertisement

వాటిని అధిగమించాడనికే శాస్త్రవేత్తలు వైర్‌లెస్‌ పేస్‌మేకర్‌ పరికరాన్ని తయారు చేశారు.తాజాగా తయారు చేసిన ఈ పరికరం ద్వారా మరణాలు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ పేస్‌ మేకర్‌ నేచర్‌ బయోటెక్నాలజీ జర్నల్‌ ప్రచురించిన కథనం ప్రకారం.ఈ పేస్‌ మేకర్‌ తయారీలో సీసంను వాడలేదు.

కాబట్టి గుండెకు ఎలాంటి ఇన్ఫెక్షన్‌ సోకదని తెలిపింది.దీని పనితీరును ఇప్పటికే పిల్లి, ఎలుక, కుందేలు గుండెల్లో అమర్చి పరిశోధనలు చేయగా, మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపింది.

పేస్‌మేకర్‌ పనితీరు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ పేస్‌ మేకర్‌ స్మార్ట్‌ఫోన్ లలో ఉపయోగించే వైర్‌ లెస్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పనిచేస్తుంది.దీని బరువు హాఫ్‌ గ్రామ్‌ కంటే చాలా తక్కువగా ఉంటుంది.పేస్‌మేకర్‌ అనేది గుండె కొట్టుకునే వేగాన్ని సరైన రీతిలో క్రమద్దీకరించడానికి ఉపయోగిస్తారు.

Advertisement

దీన్ని అరిథ్మియా అని పిలుస్తారు.ఈ పరికరంతో హృదయనాళాల ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది.

ఈ పరికరం చాలా మృదువుగా, చిన్నగా రూపొందించారు.దీన్ని మెగ్నీషియం, టంగ్‌ స్టన్, సిలికాన్, పాలిమర్‌ జాతికి చెందిన పీఎల్‌జీఏలతో తయారు చేశారు.

ఇది మన శరీరంలో జరిగే రసాయన చర్యలకు చాలా తొందరగా కరిగిపోతుంది.ప్రయోగం నిమిత్తం ఎలుకల్లో నాలుగు రోజుల పాటు ఈ పరికరాన్ని ఆపరేట్‌ చేయగా, రెండు వారాల అనంతరం శరీరంలో కరగడం మొదలైంది.7వ రోజుకు ఈ పరికరం ఏమాత్రం కనిపించకుండా పోయిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

తాజా వార్తలు