ఈటెల సొంత అజెండా ? కాక మీద కమల దళం ?

ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిపోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యమ పార్టీ నుంచి వచ్చి, కమ్యూనిజం భావజాలం ఉన్న రాజేందర్ బిజెపి వంటి మతతత్వ పార్టీ లోకి వెళ్లి తప్పు చేశారని, ఆ పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కదు అనే అభిప్రాయం అందరిలోనూ ఒక వైపు ఉండగా, కెసిఆర్ వంటి బలమైన రాజకీయ ఉద్దండుడుని ఢీ కొట్టాలంటే బిజెపి వంటి జాతీయ పార్టీ లో చేరడమే ఏకైక మార్గమని రాజేందర్ భావించారు.అదీ కాకుండా ప్రస్తుతం తనపై నమోదవుతున్న కేసులు విచారణ నుంచి ఉపశమనం పొందాలంటే బిజెపి మాత్రమే దిక్కు అనేది రాజేందర్ లో ఉన్న అభిప్రాయం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని ముందుగానే రాజేందర్ నియోజకవర్గం అంతా పర్యటనలు చేస్తూ జనాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, తనకు జరిగిన అన్యాయాలను ప్రస్తావిస్తున్నారు.

తనను మళ్లీ గెలిపిస్తే కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతాను అని, హుజురాబాద్ ప్రజల సత్తా ఏంటో కేసీఆర్ కు తెలిసొచ్చేలా చేయాలంటూ రాజేంద్ర కోరుతున్నారు.ఇక రాజేందర్ కు కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ, జై ఈటెల జై జై ఈటెల అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Advertisement

అయితే ఈ ప్రచారంలో బీజేపి ప్రస్తావన పెద్దగా రాకపోవడం, కేవలం బీజేపీ తరుపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని బిజెపి గుర్తయిన కమలానికి ఓటు వేయాలని కోరుతున్నారు తప్ప, కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి గానీ, నరేంద్ర మోదీ గొప్పతనం గురించి కానీ పెద్దగా ప్రస్తావించకపోవడం పై తెలంగాణ బీజేపీ లో చర్చ జరుగుతోంది.

వాస్తవంగా బిజెపిలో ఉన్న ఏ నాయకుడైనా కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావిస్తూ, నరేంద్రమోదీ గొప్పతనాన్ని వివరిస్తూ, హడావుడి చేస్తూ ఉంటారు. కార్పొరేషన్ ఎన్నికలు అయినా, శాసనసభ ఎన్నికలలో అయినా ఏదైనా బిజెపి అగ్ర నాయకుల గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు.అలాగే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

అయితే రాజేందర్ దానికి భిన్నంగా వ్యవహరిస్తుండడంతో బిజెపిలో ఆందోళన మొదలయ్యింది.కేవలం కేసుల నుంచి ఉపశమనం పొందడానికి, బిజెపి ని అడ్డుపెట్టుకుని సొంత బలాన్ని పెంచుకునేందుకే మాత్రమే పార్టీలో చేరారా అనే అనుమానాలు తెలంగాణ బిజెపి నాయకుల్లో పెరిగిపోతున్నాయి.

పార్టీలో చేరిన మొదట్లోనే రాజేందర్ వ్యవహారం ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు