వైయస్ వివేకా హత్య కేసులో నేడు కీలక వ్యక్తులను విచారణ చేస్తున్న సిబిఐ..!!

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి రెండోసారి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

మొదటిసారి విచారణ చేపడుతున్న సమయంలో కరోన రావటంతో.

సిబిఐ దర్యాప్తు బృందం లో అధికారులు కొంతమంది కరోనా బారిన పడటంతో .విచారణ నిలిపి వేయడం జరిగింది.అయితే ఇటీవల మరోసారి మొదటి నుండి సిబిఐ విచారణ స్టార్ట్ చేయటంతో .కేసులో కొంతమంది కీలక వ్యక్తులను ఇప్పటికే రెండోసారి విచారించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఈరోజు ఆరుగురు అనుమానితులను ముఖ్యంగా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ని మరోసారి సిబిఐ విచారణ చేస్తూ ఉంది.

పులివెందుల ప్రాంతానికి చెందిన చిన్న‌ప్ప‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డి, కాఫీ పొడి వ్యాపారి సుగుణాక‌ర్‌, సింహాద్రి పురం మండ‌లం సుంకేశుల‌కు చెందిన జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి అదే రీతిలో క‌డ‌ప‌లోని మోహ‌న్ ఆసుప‌త్రి య‌జ‌మాని ల‌క్ష్మీరెడ్డి ని విచారిస్తూ ఉన్నారు.వీళ్లందరినీ కడప ప్రాంతంలో కేంద్ర కారాగారంలో అతిథిగృహంలో విచారణ చేస్తూ ఉన్నారు.

తాజా విచారణలో పలు కీలకమైన అంశాలను సిబిఐ బృందం రాబట్టినట్లు సమాచారం.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు