అయ్యయ్యో: ఏనుగుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి గ్రామస్తులు ప్రతీరోజు జైలుశిక్ష..?!

ఏనుగులు చాలా వరకూ అడవులను విడిచిపెట్టి బయటకు రావు.ఒక వేళ వస్తే మాత్రం ఏదో ఒక ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి.

ఏనుగులే కనుక అడవుల్ని దాటుకుని గ్రామాలపై యుద్దానికి వస్తే ఆ గ్రామం మొత్తం చిన్నాభిన్నమైపోతుంది.అది ఊహించడానికే భయంగా ఉంటుంది.

మనుషులు ఏనుగులను చూసి పరుగులు పెడుతారు.అదే రాత్రి వేళ ఏనుగులు మనుషుల మీద దాడి చేసినట్లైతే చాలా మంది ప్రాణాలు కోొల్పోయే ప్రమాదం ఉంది.

అలా ఏనుగులకు భయపడిన ఓ గ్రామాల ప్రజలు ఆ ఊరును విడిచిపెట్టాల్సి వచ్చింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కాంక‌ర్‌ జిల్లాలోని పిచ్చెట్టా గ్రామస్తులు ఏనుగులకు భయపడిపోయారు.

Advertisement

దీంతో తాము నివశించే ఊరును వదిలిపెట్టి జైలులో జీవనం సాగిస్తున్నారు.ఏనుగుల నుంచి తమను కాపాడుకోవడానికి వారు ఈ పని చేస్తున్నారు.

కాంకర్ గ్రామస్తులు ప్రతీరోజు జైలుశిక్ష అనుభవిస్తుండటం చూస్తే మీరు ఆశ్చర్యపోక మానరు.గత కొన్ని రోజులుగా ఏనుగులు కాంకర్‌లోని పిచ్చెట్టా గ్రామంలో దాడులు చేస్తున్నారు.

జనాలను భయాందోళనరకు గురిచేస్తున్నాయి.ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఏనుగులకు ఆహారం దొకకపోవడం వల్ల అవి గ్రామాల మీద పడుతున్నాయి.దీంతో వాటికి ఆహారం కోసం మనుషుల మీద దాడులు చేస్తున్నాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఏనుగుల బారి నుంచి తమను తాము కాపాడుకోవటానికి ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారు.తమను తాము కాపాడుకోవడానికి అక్కడి నుంచి మరో ఊరికి పారిపోయారు.

Advertisement

అయితే గ్రామానికి సమీపంలో కొత్తగా ఓ జైలును నిర్మిస్తున్నారు.దీంతో ప్రజలు ఏనుగుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ జైలులో తలదాచుకుంటున్నారు

గ్రామంలోని 300 మంది ప్రజలు పగలంతా తమ ఊరిలోనే గడుపుతున్నారు.అయితే రాత్రి మాత్రం వారు జైలుకు వచ్చి నిద్రపోతున్నారు.దీంతో ఏనుగులు బాధ తప్పింది.

ఇలా జరుగుతున్న సమయంలో ఏనుగులు తమ ఇంటి పరిసరాలను రాత్రి వచ్చి చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆహారపదార్థాలను నాశనం చేస్తున్నాయి.

అయినా ప్రజలు ఈ సమస్య కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.

తాజా వార్తలు