టాలీవుడ్ హీరోల 25వ సినిమా రిజల్ట్ ఏంటో తెలుసా?

గతంలో హీరోలు వందల కొద్ది సినిమాలు చేసేవారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంఖ్య భారీగా తగ్గింది.

కనీసం తమ కెరీర్ లో 100 సినిమాలు చేయడం కూడా గగనమే అనిపిస్తోంది.లేటెస్ట్ జనరేషన్ హీరోల్లలో ఒక్క అల్లరి నరేష్ మినహా మరే హీరో కూడా 50 సినిమాలు చేయలేదు.

చాలా మంది హీరోలు 25 సినిమాలనే తమ మైలు రాయిగా మార్చుకుంటన్నారు.పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు 25 సినిమాల మార్కును క్రాస్ చేశారు.అయితే పాత తరం నుంచి కొత్త తరం హీరోల వరకు తమ 25వ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

సీనియర్ ఎన్టీఆర్

తన కెరీర్ లో 25వ చిత్రం ఇద్దరు పెళ్లాలు.నాగూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఏఎన్నార్

Advertisement

అక్కినేని నాగేశ్వరరావు 25వ మూవవీ బ్రతుకు తెరువు.రామకృష్ణారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

సూపర్ స్టార్ కృష్ణ

తన 25వ సినిమా బొమ్మలు చెప్పిన కథ.తక్కువ సమయంలోనే తను 25వ సినిమా మార్క్ ను అందుకున్నాడు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

శోభన్ బాబు

తన 25వ సినిమా గూఢాచారి 116.ఇందులో శోభన్ బాబు కీ రోల్ ప్లే చేశాడు.ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

చిరంజీవి

చిరంజీవి 25వ సినిమా న్యాయం కావాలి.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది.

బాలకృష్ణ

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తన 25వ చిత్రం నిప్పులాంటి మనిషి.హిందీలో ధర్మేంద్ర చేసిన ఖయామత్ కు రీమేక్.ఈ మూవీ యావరేజ్ గా ఆడింది.

నాగార్జున

Advertisement

నాగ్ 25వ సినిమా జైత్రయాత్ర.ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం పాలైంది.

వెంకటేశ్

వెంకీ 25వ సినిమా కొండపల్లి రాజా.రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

పవన్ కల్యాణ్

తన 25వ సినిమా అజ్ఞాతవాసి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జాస్టర్ అయింది.

మహేశ్ బాబు

తన 25వ సినిమా మహర్షి.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది.

జూ.ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్ తన 25వ సినిమాగా నాన్నకు ప్రేమతో చేశాడు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమ మంచి విజయం సాధించింది.

అటు ప్రభాస్, రాం చరణ్, అల్లు అర్జున్ 25 సినిమాల మార్కును క్రాస్ చేయలేదు.

తాజా వార్తలు